ఇద్ద‌రు యువ‌తుల ప్రాణాలు తీసిన ఫేస్‌బుక్ లైవ్‌..! అప్ర‌మ‌త్తంగా లేకుంటే అంతే..!

నేటి త‌రుణంలో సోష‌ల్ మీడియా పిచ్చి కొంద‌రిలో ఏ పీక్స్ కు చేరిందంటే… ల‌క్ష‌ల కొద్దీ వ్యూస్‌, వేల కొద్దీ లైక్‌లు, కామెంట్లు… తెప్పించుకోవ‌డం కోసం ఏదైనా చేస్తున్నారు.చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉందంటే చాలు, ఏదో ఒక ఫొటోనో, లేదా వీడియోనో పోస్ట్ చేయ‌డం… అనంత‌రం వాటికి లైక్‌లు, కామెంట్లు తెప్పించుకోవ‌డం ఇదే కొంద‌రికి పనిగా మారింది.

 Teenagers Killed In Highway Smash After Filming Themselves On Facebook Live-TeluguStop.com

ఈ క్ర‌మంలో అలాంటి వ్య‌క్తులు చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తున్నారు.మ‌రీ ఈ మ‌ధ్య‌న అయితే ఫేస్‌బుక్‌లో లైవ్ అనే ఆప్ష‌న్ వ‌చ్చిందిగా… దీంతో కొంద‌రు వ్య‌క్తుల‌కు కోతికి కొబ్బ‌రి చిప్ప దొరికిన‌ట్టే అయింది.

ఫేస్‌బుక్‌లో ఎడా పెడా లైవ్‌లు పెడుతూ, అవ‌సరం ఉన్నా లేకున్నా సోష‌ల్ మీడియా పిచ్చిని అంద‌రికీ చూపిస్తున్నారు.ఈ క్ర‌మంలోనే అలా ఫేస్‌బుక్ లో లైవ్ పెట్టిన ఇద్ద‌రు యువతులు త‌మ ప్రాణాల‌నే కోల్పోయారు.

విషాద‌క‌ర‌మైన ఈ సంఘ‌ట‌న అమెరికాలోని పెన్సిల్వేనియాలో చోటు చేసుకుంది.

బ్రూక్ మిరండా హ్యూస్, చనియా మారిసన్ అనే ఇద్ద‌రు యువతులు అమెరికాలోని పెన్సిల్వేనియా లో ఉంటున్నారు.వీరిరువురు ఈ నెల 6వ తేదీన మంగ‌ళ‌వారం రాత్రి ర‌హ‌దారిపై కారులో ప్ర‌యాణిస్తున్నారు.ఈ క్ర‌మంలో వారు ఫేస్‌బుక్‌లో కొత్త‌గా వ‌చ్చిన లైవ్ ఫీచ‌ర్‌తో అవ‌త‌లి త‌మ స్నేహితుల‌తో సంభాష‌ణ సాగించ‌డం మొదలు పెట్టారు.అయితే అంతా బాగానే ఉంది కానీ… వారి ప్ర‌యాణంలో అనుకోకుండా వారు ఒక్క‌సారిగా త‌మ కారును స్లో చేశారు.అస‌లే… హైవే… అక్క‌డి రోడ్లు ఎలా ఉంటాయో తెలుసు క‌దా.! గంట‌కు 100 నుంచి 200 కిలోమీట‌ర్ల వేగంతో వాహ‌నాలు ప్ర‌యాణిస్తాయి.ఈ క్ర‌మంలో వారు త‌మ కారును ఒక్క‌సారిగా స్లో చేయ‌డంతో వెనుక నుంచి వ‌స్తున్న ఓ ట్రాక్ట‌ర్ వారిని వేగంగా ఢీకొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో కారు అక్క‌డికక్క‌డే నుజ్జు నుజ్జ‌యింది.అనంత‌రం వెంట‌నే పెద్ద‌గా పేలుడు సంభ‌వించ‌డంతో వారు కారులోనే స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు.

ఫేస్‌బుక్‌లో లైవ్ లోఉండి, వెనుక వస్తున్న వాహ‌నాన్ని గ‌మ‌నించ‌క‌పోవ‌డంతోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని పోలీసులు చెప్పారు.అయితే బ్రూక్ మిరండా హ్యూస్, చనియా మారిసన్ ల‌తో లైవ్‌లో ఉన్న అవ‌తలి వ్య‌క్తుల‌కు మాత్రం ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో ఏమీ అర్థం కాలేద‌ట‌.

ఒక్క‌సారిగా లైవ్ ఆగిపోవ‌డంతో వారికి ఏమీ తెలియ‌లేద‌ట‌.దీంతో వారు కొంత‌సేపు సందిగ్ధంలో ఉండి ఆన‌క విష‌యాన్ని పోలీసుల‌కు చెప్పార‌ట‌.

దీంతో అస‌లు విష‌యం తెలిసింది.చూశారుగా.! ఫేస్‌బుక్ లైవ్ ఎలా ప్రాణాల‌ను బ‌లిగొందో.! అయితే ఇలాంటి ఘ‌ట‌న‌లు ఇంత‌కు ముందు కూడా అక్క‌డ అనేకం జరిగాయ‌ట‌.! ఏది ఏమైనా ఫేస్‌బుక్ లైవ్‌ను వాడేముందు మాత్రం ఇలా ప్ర‌యాణాలు అయితే చేయ‌కూడ‌దు.!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube