టిక్ టాక్ వీడియో చేస్తూ బుల్లెట్ పేలి యువకుడు మృతి  

Teenager Shot Dead While Posing With For Tiktok Video-

ఇటీవల టిక్ టాక్ వీడియో లు యువత ను ఎంతగా ఆకర్షిస్తున్నాయో అన్న విషయం తెలిసిందే.ఈ వీడియో లలో భిన్నంగా కనిపించడం కోసం కొందరు అయితే పిచ్చి పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

Teenager Shot Dead While Posing With For Tiktok Video--Teenager Shot Dead While Posing With For TikTok Video-

అలాంటి ఒక పిచ్చి ప్రయత్నం చేసి ఒక 17 సంవత్సరాల యువకుడు వీడియో చేస్తూనే ప్రాణాలు కోల్పోయాడు.ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే… మహారాష్ట్ర కు చెందిన ప్రతీక్ అనే 17 ఏళ్ల యువకుడు టిక్ టాక్ లో భిన్నమైన వీడియో చేయాలి అని స్నేహితులతో కలిసి నిర్ణయించుకున్నాడు.దీనితో ఒక దేశీ తపంచా సంపాదించి దానితో తలకు గురిపెట్టుకొని ఒక సరదా వీడియో తీయాలని, అనుకున్నదే తడవుగా పొలాల్లో పందులను కాల్చే దేశీ తుపాకీ ని సంపాదించాడు.అంతటితో ఆగకుండా తన కణతికి గురిపెట్టుకొని డైలాగ్ చెబుతూ వీడియో చిత్రీకరించాడు.ఈ క్రమంలో అనుకోకుండా ట్రిగ్గర్ నొక్కడం, దానిలో మందుగుండు ఒక్కసారిగా పేలడం తో ప్రతీక్ తలలోకి గుండు ఒక్కసారిగా దూసుకెళ్లింది.

Teenager Shot Dead While Posing With For Tiktok Video--Teenager Shot Dead While Posing With For TikTok Video-

దీనితో ఒక్కసారిగా ఉలిక్కిపక్క ప్రతీక్ కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

ప్రతీక్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.దీనితో ప్రతీక్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.మరోపక్క కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటన పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

ఈ టిక్ టాక్ ని బ్యాన్ చేయాలనీ గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ ఈ మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.మొన్నటికి మొన్న తమిళనాడు ఒక గృహిణి టిక్ టాక్ చూడవద్దని భర్త మందలించాడు అన్న కారణంగా టిక్ టాక్ వీడియో తీస్తూ ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే.