అగ్గిపెట్టె ఇవ్వలేదని అమ్మాయి పై టీనేజర్ రాక్షసత్వం!  

Tamilnadu Boy Shots grl for Not giving Match Box, Angry, teenager, shoots woman, matchbox, tamil nadu - Telugu Angry, Matchbox, Shoots Woman, Tamil Nadu, Tamilnadu Boy Shots Grl For Not Giving Match Box, Teenager

ఈ కాలంలో పిల్లలు ఎంత క్రూరంగా మారారు అంటే అసలు చెప్పలేం.ఎందుకంటే వారి కోపం అసలు భరించలేం.

TeluguStop.com - Teenager Shoots Woman For Denying Matchbox Tamil Nadu

అలాంటి కోపాన్ని చూపించాడు ఓ టీనేజర్.నిజానికి ఆ విషయంపై అంత కోపం చూపించాల్సిన అవసరం లేదు.

కానీ అధిక కోపంతో ఓ అమ్మాయ్ ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతుంది.

TeluguStop.com - అగ్గిపెట్టె ఇవ్వలేదని అమ్మాయి పై టీనేజర్ రాక్షసత్వం-General-Telugu-Telugu Tollywood Photo Image

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా పంతోప్పు సమీపంలోని మాంగమాప్పురంకి చెందిన 17 ఏళ్ల కుర్రాడు మద్యానికి బానిసయ్యాడు.ఇంకా అలానే ఫుల్ గా మద్యం తాగి మత్తులో బంధువుల ఇంటి వద్దకు వెళ్లాడు.

అక్కడికి వెళ్లిన ఆ కుర్రాడు 22 ఏళ్ల యువతిని అగ్గిపెట్టె తెచ్చివ్వాలంటూ అడిగాడు.

అందుకు ఆమె నిరాకరించింది.

ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది.దీంతో రెచ్చిపోయిన ఆ 17 ఏళ్ళ యువకుడు అక్కడే దారుణానికి పాల్పడ్డాడు.

అగ్గిపెట్టె ఇవ్వలేదన్న కోపంతో ఇంటికి వెళ్లిన యువకుడు నాటు తుపాకీ తెచ్చి యువతిపై కాల్పులు జరిపాడు.ఎడమ కాలు, ఎడమ చెయ్యి నుంచి బుల్లెట్లు దూసుకుపోవడంతో తీవ్ర రక్థస్రావం మధ్య ప్రాణాల కోసం కొట్టమిట్టాడుతూ స్థానికులకు కనిపించింది.

దీంతో వారు ఆమెను కృష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది.సమాచారం తెలుసుకున్న పోలీసులు టీనేజర్‌పై కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే కాల్చిన అబ్బాయ్ కూడా బంధువుల అబ్బాయ్ అని సమాచారం.

ఈ కాలంలో టీనేజర్ లు కావాల్సిన వస్తువు దొరకకపోతే కోపాన్ని అదుపు చేసుకోలేక వారు ఆత్మహత్య చేసుకోవడం లేదా ఇతరులను హత్య చేయడం వంటి పనులు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారగా టీనేజర్స్ సినిమాలను చూసి చెడిపోతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

#Tamil Nadu #TamilnaduBoy #Shoots Woman #Matchbox #Teenager

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teenager Shoots Woman For Denying Matchbox Tamil Nadu Related Telugu News,Photos/Pics,Images..