నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన 14 ఏళ్ల మనవడు!  

Teenager sets grandma ablaze over property in Hyderabad,Hyderabad, Property Issues, Grandma - Telugu Grandma, Hyderabad, Property Issues, Teenager Sets Grandma Ablaze Over Property In Hyderabad

మనుషుల్లో మానవత్వం రోజురోజుకు కరువైపోతుంది.నోరులేని మూగ జీవాలు ఇతర మూగజీవాల పట్ల ఎంతో దయ చూపిస్తూ ఉంటే మనుషులు మాత్రం సాటి మనుషులపై ఏమాత్రం దయ చూపించలేకపోతున్నారు.

 Teenager Sets Grandma Ablaze Property Issue

కసాయి లాగా మారి ప్రాణాలను సైతం తోడేస్తున్నారు.ఇలా మృగాలుగా మారిపోతున్న మనుషులు బంధాలను బంధుత్వాలను మరుచి దారుణంగా హత్యలకు పాల్పడిన ఘటనలు రోజురోజుకు తెరమీదకు వస్తున్నాయి.
తాజాగా జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది.ఏకంగా ఆస్తి కోసం సొంత నాయనమ్మ పైనే పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఒక కసాయి మనవడు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది .రంగారెడ్డి జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ దారుణ ఘటన.రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జిల్లా వృద్ధురాలికి కొడుకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.అందరికీ వివాహం అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఆ వృద్ధురాలు తన ఆస్తిని కొడుకుతో పాటు కూతుళ్ళకి కూడా సమానంగా పంచింది .కానీ ఈ విషయం ఆ వృద్ధురాలు కొడుకుకి మనవడికి మింగుడు పడలేదు.ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఆస్తి మొత్తం తమకే వస్తుందనుకుంటే వృద్ధురాలు ముగ్గురు కుమార్తెలకు ఆస్తి ఇవ్వటంతో కసాయి గా మారిపోయాడు మనవడు.ఇక ఆస్తి మొత్తం తమ పేరు మీద రాయాలంటూ వృద్ధురాలిపై ఒత్తిడి చేశాడు కానీ వృద్ధురాలు ససేమిరా అంది .దీంతో కసాయి గా మారిన మనవడు ఆమె పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.దీంతో ఆర్తనాదాలు చేస్తూ ఆ వృద్ధురాలు అక్కడికక్కడే మంటల్లో కాలిపోయి బూడిద అయింది.

నానమ్మపై పెట్రోల్ పోసి నిప్పంటించిన 14 ఏళ్ల మనవడు-General-Telugu-Telugu Tollywood Photo Image

అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

#Hyderabad #Property Issues #Grandma

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teenager Sets Grandma Ablaze Property Issue Related Telugu News,Photos/Pics,Images..