అంకుల్ తో ప్రేమలో పడి గర్భం దాల్చిన యువతి... చివరికి అంకుల్ తో కలిసి ...

ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న  ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకుగాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న ఆగడాలు మాత్రం ఆగడం లేదు.తాజాగా కన్న కూతురు వయస్సున్న యువతితో ఓ వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకొని చివరికి ఆమెని గర్భవతిని చేసిన ఘటన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో వెలుగు చూసింది.

 Teenage Girl Pregnant By Old Men In Hyderabad-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే 16 సంవత్సరాల కలిగినటువంటి ఓ యువతి స్థానిక నగరంలో తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది. అయితే ఈ యువతి అప్పుడప్పుడు చదువుకోవడం కోసం తన స్నేహితురాలి ఇంటికి వెళ్తూ, వస్తూ ఉండేది.

 ఈ క్రమంలో తన స్నేహితురాలి తండ్రి చెప్పిన మాటలను నమ్మి అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది.దీంతో తాజాగా యువతి గర్భం దాల్చింది.దీంతో ఈ విషయం బయటికి తెలిస్తే తన కుటుంబ సభ్యుల పరువు పోతుందని రహస్యంగా తన స్నేహితురాలి తండ్రిని పెళ్లి చేసుకునేందుకు పన్నాగం పన్నింది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తాను అంకుల్ ని పెళ్లి చేసుకోవడానికి వెళ్లిపోతున్నానని చెబుతూ ఓ లెటర్ ని రాసి తన ప్రియుడితో కలిసి వెళ్ళిపోయింది.

 Teenage Girl Pregnant By Old Men In Hyderabad-అంకుల్ తో ప్రేమలో పడి గర్భం దాల్చిన యువతి… చివరికి అంకుల్ తో కలిసి …-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు బోరున విలపించారు. అంతేకాక తమకు కూతుర్ని ఎలాగైనా వెతికి తమకు అప్పగించాలని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను ఆశ్రయించారు.దీంతో ఈ విషయం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అంతేగాక ఈమధ్య కాలంలో కొందరు  కామాంధకారంలో మునిగిపోయి వావి వరసలు మరచి వయసుతో సంబంధం లేకుండా ప్రవర్తిస్తున్నారని అభి ప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 అంతేగాక తన కూతురు వయస్సున్న యువతిని మోసం చేసి గర్భవతిని చేసినందుకు నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నారు.

#HyderabadCrime #Hyderabad #TeenageGirl #TeenageGirl #TeenageGirl

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు