స్నానానికి వెళ్లిన కూతురు..కాసేపటికి బాత్రూమ్ కి వెళ్లి చూసిన తల్లి షాక్.. అసలు విషయం ఇదే..  

Teenage Girl Dies After Dropping Phone Into Bath While Charging-phone Into Bath,teenage Girl Dies,బాత్రూం లోకి మొబైల్

మాస్కో నగరానికి చెందిన 48 ఏళ్ల ఒక్సానా తన కూతురు అనస్తేసియా తో కలిసి నివాసిస్తుంది. అయితే తల్లి ఒక్సానా మాస్కో లోని ఒక ప్రముఖ కంపెనీ ని లో ఉద్యోగం చేస్తుంది. అయితే ఆమెకి నైట్ స్విఫ్ట్ లో జాబ్ ఉండడం తో రాత్రి కూతురు స్నానాననికి వెళ్తున్నపుడు ఆఫీస్ కి వెళ్తున్న అని చెప్పి వెళ్ళింది , ఉదయాన్నే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన ఒక్సానా బాత్రూమ్ లో ఉన్న కూతురుని చూసి షాక్ అయింది. అసలు విషయానికొస్తే..

స్నానానికి వెళ్లిన కూతురు..కాసేపటికి బాత్రూమ్ కి వెళ్లి చూసిన తల్లి షాక్.. అసలు విషయం ఇదే..-Teenage Girl Dies After Dropping Phone Into Bath While Charging

48 ఏళ్ల ఒక్సానా కి 20 ఏళ్ల అందమైన కూతురు అనస్తేసియా ఉంది , వారిద్దరూ కొంతకాలంగా మాస్కో నగరం లో ఉంటున్నారు. అక్కడే ప్రముఖ కంపెనీ లో తన తల్లి నైట్ షిఫ్ట్ లో ఉద్యోగం చేస్తుంది. అయితే అనస్తేసియా కి ఎక్కువగా ఫోన్ వాడే అలవాటు ఉంది , ఏ పని చేసిన ఫోన్ మాత్రం చేతిలో ఉండాల్సిందే .

ఇటీవల తన తల్లి రాత్రి ఆఫీస్ కి వెళ్తుండగా అనస్తేసియా స్నానం కోసం బాత్రూమ్ కి వెళ్తుంది చేతిలో ఫోన్ కూడా ఉంది. ఒక్సానా ఆఫీస్ ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చి తలుపు తీసింది అనస్తేసియా అని పిలవగా ఇంట్లో నుండి ఏ శబ్దం రాలేదు.

రాత్రి బాత్రూమ్ కి వెళ్లిన అనస్తేసియా బాత్రూమ్ తలుపు పెట్టె ఉంది. ఒక్సానా ఆ తలుపు ని తీయడానికి ప్రయత్నించగా మెల్లిగా బాత్రూమ్ డోర్ తెరుచుకుంది చూసే సరికి ఒక్సానా షాక్ అయింది.

బాత్రూమ్ టబ్ లో ఫోన్ ఛార్జింగ్ తో పెట్టి తన చేతిలో ఫోన్ తో నిద్రపోతున్న అనస్తేసియా ని ఎంతగా నిద్ర లేపిన లేవలేదు. ఫోన్ ఛార్జింగ్ తీసేసి ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె రాత్రే షాక్ తగిలి చనిపోయిందని డాక్టర్ లు తెలిపారు.స్నానం చేస్తున్న సమయంలో చార్చింగ్ పెట్టిన ఫోన్ నీళ్లలో పడిందని, దాంతోనే ఆమె మరణించిందని వారు తేల్చారు..

ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఒకే మార్గం ఉందని, దయచేసి స్నానాల గదిలోకి ఫోన్ తీసుకెళ్ల వద్దని కోరారు.