యాపిల్ కంపెనీలో ఉద్యోగం కోసం ఆ కుర్రాడు చేసిన పని ఏంటో తెలుసా

మొబైల్ స్మార్ట్ ఫోన్ రంగంలో సంచలనం అయిన యాపిల్ కంపెనీలో ఉద్యోగం అంటే ఎవరికైనా సరదా ఉంటుంది.ఇక ప్రపంచంలోనే అత్యధిక భద్రత ఉండే ఫోన్స్ కూడా యాపిల్ అనే విషయం అందరికి తెలిసిందే.

 Teenage Boy Hacked Apple Servers For Job In Apple Company-TeluguStop.com

అందుకే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ఖరీదు కూడా వేలు, లక్షల్లో ఉంటాయి.అయినా కూడా యాపిల్ ప్రొడక్ట్స్ వాడటానికి అందరూ ఆసక్తి చూపిస్తారు.

ఇదంతా ఇప్పుడు ఎందుకని అంటే యాపిల్ కంపెనీలో ఉద్యోగం కోసం ఓ 17 ఏళ్ల కుర్రాడు ఎవరు చేయని సాహసం చేసాడు.అయితే ఆ కుర్రాడికి ఉద్యోగం రాలేదు సరికదా ఇప్పుడు చేసిన పనికి జైల్లో ఉన్నాడు.

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడు యాపిల్ సర్వర్లను హ్యాక్ చేశాడు.2015లో ఒకసారి యాపిల్ సర్వర్లను హ్యాక్ చేయగా మళ్ళీ 2017లో ఓ సారి హ్యాక్ చేసాడు.దీంతో కంపెనీ ఎఫ్‌బీఐ‌ని ఆశ్రయించింది.ఎఫ్‌బీఐ ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ శాఖను సంప్రదించగా, ఆస్ట్రేలియా పోలీసులు ఆ కుర్రాడిని అరెస్ట్ చేసారు.అయితే యాపిల్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం కోసమే తాను ఈ పని చేసినట్టు పోలీసులకు చెప్పి షాక్ ఇచ్చాడు.ఇదిలా ఉంటే.

కుర్రాడు ఎటువంటి తప్పుచేయలేదని అతని తరపున లాయరు కోర్టులో వాదించాడు.యూరోప్‌లో ఇలాంటి ఘటనే జరిగితే యాపిల్ కంపెనీ హ్యాక్ చేసిన కుర్రాడికి ఉద్యోగం ఇచ్చిందని.

ఆ ఉద్దేశంతోనే ఇతను కూడా హ్యాకింక్‌కు పాల్పడ్డాడని లాయర్ చెప్పుకొచ్చాడు.అయిన కూడా చేసింది నేరం కాబట్టి కోర్ట్ ఆ కుర్రాడికి 500 డాలర్ల జరిమానా విధించి, తొమ్మిది నెలల పాటు కోర్టు పర్యవేక్షణ ఉంచింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube