మీకు డబ్బున్న పర్సు దొరికితే ఏం చేస్తారు ? ఇతడు ఏం చేసాడో తెలిస్తే తప్పకుండా మీరు అభినందిస్తారు...  

Teen Turns In Lost Wallet, Story Goes Viral -

మనకి రోడ్డు పైనా లేదా మరెక్కడైన డబ్బున్న పర్సు దొరికితే ఏం చేస్తాం , చాలా మంది అయితే డబ్బుని తీసుకొని పర్సు ని పక్కన పడేస్తాం , కానీ అమెరికా లో ఒకతనికి పర్సు దొరికితే ఏం చేసాడో తెలిస్తే ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది.

Teen Turns In Lost Wallet, Story Goes Viral

అసలు విషయం ఏంటంటే

హంటర్ సమత్ అనే వ్యక్తి అమెరికా లో ఒక సిటీ లో జరుగుతున్న తన చెల్లి పెళ్లి కోసం ఆఫీస్ కి సెలవు తీసుకొని విమానం లో పెళ్లికి బయల్దేరాడు.ఆ విమానం ఎక్కిన కొద్దీ సేపటికి అలిసిపోయిన హంటర్ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.నిద్ర లేచి చూసే సరికి తణుకు దిగవలిసిన గమ్య స్థానం వచ్చేసింది.సమయం లేక హడావిడిగా విమానం దిగి పోయి , కార్ లో చెల్లి పెళ్లికి వెళ్ళాడు.కార్ దిగాక కార్ డ్రైవర్ కి డబ్బులివ్వబోతే జేబులో పర్సు లేదు.

కార్ మొత్తం వెతికాడు కానీ అందులో పర్సు లేదు.అప్పుడు అర్థమైంది తన పర్సు విమానం లో పోయింది అని.అక్కడి నుండి టెన్షన్ టెన్షన్ గా మళ్ళీ ఎయిర్ పోర్టుకు బయలుదేరాడు.అక్కడి సిబ్బందికి విమానంలో నా పర్సు మర్చిపోయానంటూ, వెంటనే అది వెతికి నాకివ్వాలంటూ కోరాడు.

మీకు డబ్బున్న పర్సు దొరికితే ఏం చేస్తారు ఇతడు ఏం చేసాడో తెలిస్తే తప్పకుండా మీరు అభినందిస్తారు…-General-Telugu-Telugu Tollywood Photo Image

అక్కడి సిబ్బంది వెంటనే వెళ్లి విమానం మొత్తం వెతికినా అక్కడ కనిపించలేదు.ఇక చేసేదేమీ లేక నిరాశతో అక్కడి నుండి అతని చెల్లి పెళ్ళికి తిరుగుముఖం పట్టాడు.

అక్కడ తన చెల్లి పెళ్లి ఘనంగా జరుగుతున్న హంటర్ సమత్ మాత్రం తాను పోగొట్టుకున్న ఆ పర్సు గురించే ఆలోచించడం మొదలు పెట్టాడు.ఎందుకంటే అందులో అతడి దగ్గర ఉన్న 40 డాలర్లతో పాటు 400 డాలర్ల చెక్ మరియు అతని కంపెనీ కి సంబందించిన ఐ డి కార్డ్ లు ఉన్నాయి.పెళ్లి నుండి తిరిగి ఇంటికెళ్లిన అతనికి ఒక కొరియర్ వచ్చిందని వారింట్లో చెప్పగా అది తెరిచి చూసి షాక్ కు గురయ్యాడు.ఆ కొరియర్ లో హంటర్ ఫ్లైట్‌లో పొగొట్టుకున్న పర్స్, ఓ ఉత్తరం ఉన్నాయి.

ఆ ఉత్తరం తెరచి చూడగా అందులో ఇలా రాసి ఉంది.ఒమాహా నుంచి డెన్వర్ వెళ్తున్న ఫ్లైట్‌లో 12వ వరుసలో సీట్ ఎఫ్ వద్ద ఈ పర్స్ నాకు దొరికింది.

ఇప్పటికే దీని కోసం నువ్వు చాలా వెతికి ఉంటావని నాకు తెలుసు, ఇప్పుడు దీన్ని నీకు పంపుతున్నాను.నీ పర్స్ లో మొత్తం 40 డాలర్లు డబ్బు ఉంది.

వాటికి తోడు ఇది దొరికిన సంతోషంలో పార్టీ చేసుకుంటావేమోనని మరో 60 డాలర్లు డబ్బును కలిపి టోటల్ 100 డాలర్లని ఇందులో పంపుతున్నాను ,కాబట్టి పార్టీని బాగా ఎంజాయ్ చేసి ఇప్పటికైనా ప్రతి విషయంలో జాగ్రత్తపడు అంటూ లెటర్ రాసి అల్ ది బెస్ట్ కూడా చెప్పారు.అది చూసిన హంటర్ షాక్‌ తిన్నాడు.

తర్వాత ఎంతో సంతోషంగా ఈ విషయాన్ని ఫేస్‌బుక్ వేదికగా మొత్తం వివరాలు పంచుకున్నాడు.

హంటర్ పోగొట్టుకున్న పర్సు ని తిరిగి పంపించిన వ్యక్తి తన అడ్రెస్ ని ఇవ్వలేదు కాబట్టి అతను ఎవరో తెలియదు.హంటర్ కి కొరియర్ చేసిన వ్యక్తి ఆ పర్సు లోని డబ్బులు తీసుకొని పర్సు గురించి మర్చిపోవచ్చు కానీ అతని దానికి మరో కొంత డబ్బు కలిపి పంపడం అన్నది గొప్ప విషయం , ఇలాంటి మనుషులు చాలా తక్కువ మంది ఉంటారని సమత్ తన సోషల్ మీడియా లో పేర్కొన్నాడు.ఈ ఉత్తరం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Teen Turns In Lost Wallet, Story Goes Viral- Related....