బ్రతికుండాలా? చనిపోవాలా పోల్ నిర్వహించిన యువతి  

Teen Takes Her Own Life After Conducting Instagram Poll On Whether To Or Die-general Updates,intragram,life,poll,teen Girl,యువతి

రాను రాను ఈ సమాజం ఏమైపోతుందో అర్ధం కావడం లేదు. ఒక వ్యక్తి చనిపోతున్నారు అంటే ఎవరైనా బతికించడానికి ప్రయత్నిస్తాం. కానీ చనిపోమని మరి ఇంతలా ఎంకరేజ్ చేస్తారా అని అనిపిస్తుంది..

బ్రతికుండాలా? చనిపోవాలా పోల్ నిర్వహించిన యువతి-Teen Takes Her Own Life After Conducting Instagram Poll On Whether To Live Or Die

ఈ ఘటన మలేషియా లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…. 16 ఏళ్ల అమ్మాయి చాలా ముఖ్యమైన అంశం ఇది. నేను చనిపోవాలా?బ్రతికుండాలా? సహాయం చేయండి అంటూ ఇన్స్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి పోల్ నిర్వహించింది. అయితే ఆ పోస్ట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

కానీ దాదాపు 60 శాతం మంది ఆమెను చనిపోవాలి అంటావు ప్రోత్సహించడం దారుణం. ఒక 16 ఏళ్ల అమ్మాయి చనిపోవాలా బ్రతికుండాలా అని అడిగితె ఎవరైనా చిన్న వయసు జీవితంలో కష్టాలు సహజం దానికి చావు పరిష్కారం కాదు అంటూ చెప్పాల్సిన నెటిజన్లు ఏకంగా ఆ యువతి చనిపోవాలి అంటూ ఎక్కువ మంది ప్రోత్సహించడం తో ఆ యువతి కాసేపటికి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయినట్లు తెలుస్తుంది. మంగళవారం ఈ ఘటన చోటుచేసుకోగా,అసలు ఆయువతి ఎందుకు అలాంటి పోల్ నిర్వహించింది, ఈ పోల్ వెనుక అసలు కారణం ఏంటి అన్న వివరాలు మాత్రం తెలియరాలేదు.