అతి చిన్న వయసులోనే ప్రపంచాన్ని చుట్టేసిన యువతి.. గిన్నిస్ రికార్డ్!

గిన్నెస్ బుక్ లో రికార్డు సాధించాలని కొంతంమంది రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు మరికొంత మందికి మాత్రం అనుకోకుండా ఈ అవకాశం లభిస్తుంది.ఇప్పటికే గిన్నిస్ బుక్ లో కొన్ని వేల రికార్డులు ఉన్నాయి కొన్ని రికార్డులు చూస్తే ఇలాంటివి చేసి కూడా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించు కోవచ్చా అని అనుకోక మానరు.

 Teen Pilot Becomes Youngest Female To Fly Solo Around The World, 19 Years, Inter-TeluguStop.com

అంతలా ఆశ్చర్యం కలిగించేవి కూడా ఉంటాయి.

అయితే ఇప్పుడు మనం చెప్పుకునేది మాత్రం మరొక కొత్త రికార్డ్.

ఆ యువతి 19 ఏళ్ల వయసులోనే గిన్నిస్ రికార్డ్ సాధించింది.ఆ వయసులో కాలజీకి వెళ్లి చదువుకోవడం తప్ప చాలా మందికి లోకజ్ఞానం కూడా సరిగా ఉండదు.

కానీ ఈ యువతి మాత్రం ఆ వయసులోనే ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి వచ్చింది.ఈమె ఇంత చిన్న ఏజ్ లో ఏకంగా 41 దేశాలకు ఒంటరిగా ప్రయాణించి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈమె ఇంత చిన్న వయసులో అన్ని దేశాలు తిరిగి రావడంతో గిన్నిస్ రికార్డు లోకి కూడా ఎక్కింది.అదేంటో పూర్తిగా తెలియాలంటే అసలు మ్యాటర్ తెలియాల్సిందే.బెల్జియం కు చెందిన 19 ఏళ్ల యువతీ ఈ అరుదైన ఫీట్ అందుకుంది.ఈమె పేరు రూథర్ ఫర్డ్.ఈమె 19 ఏళ్ల వయసులోనే సహస యాత్రకు శ్రీకారం చుట్టేసి రికార్డ్ క్రియేట్ చేసింది.ఆ 5 నెలల పాటు ఇంట్లో వాళ్లకు దూరంగా ఉంటూ చిన్న విమానంలో ప్రపంచాన్ని చుట్టేసి వచ్చింది.

రూథర్ ఫర్డ్ కు చిన్నతనం నుండే పైలెట్ అవ్వాలనే కల.అందులోను ఈమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా పైలెట్స్ నే అవ్వడంతో ఈమె కల కూడా నెరవేరడానికి మార్గం సుముఖం అయ్యింది.ఈమె ఆరేళ్లకే చిన్న చిన్న విమానాల్లో ప్రయాణించడం ప్రారంభించింది. 14 ఏళ్లకే సొంతంగా విమానం నడపడంలో కూడా ఆరితేరి ప్రపంచాన్ని చుట్టి రావాలని 2021, ఆగస్టు 18న బయలు దేరింది.

ఆమె ప్రపంచ యాత్ర మూడు నెలల్లోనే పూర్తి కావాలి.కానీ ప్రతికూల వాతావరణం, వీసా సమస్యల వల్ల ఆలస్యం అయ్యి చివరికి 41 దేశాలను 155 రోజుల తర్వాత ముగించి గిన్నిస్ రికార్డ్ క్రియేట్ చేసింది.

అన్ని దేశాలు చుట్టేసి వచ్చిన ఆమెకు స్వదేశం ఘన స్వాగతం పలికింది.

Teen Pilot Becomes Youngest Female To Fly Solo Around The World, 19 Years,international News,teenage Pilot,World Tour - Telugu International, Teenpilot, Teenage Pilot

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube