ఓలా బైక్ చుట్టూ యువతీయువకుల నృత్యాలు!

పెట్రోల్ ధరలు ఎక్కువ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి.

 Teen Dances Around Ola Bike , Ola Scotter , Dance, Viral Latest, News Viral, Soc-TeluguStop.com

పెట్రోల్ రేట్లు పెరిగాయనే వార్తలు వింటే చాలు గుండెపోటు వచ్చినంత పనవుతుంది.దీంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు దృష్టిసారిస్తున్నారు.

ఇటువంటి తరుణంలో ఎలక్ట్రిక్ బైకులు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.పెట్రోల్ రేట్లతో పోలిస్తే ఎలక్ట్రిక్ బైకులకు అయ్యే వ్యయం చాలా తక్కువ.

ఇలా ఆలోచిస్తున్న ఎందరో ప్రజలకు భవీష్ అగర్వాల్ గుడ్ న్యూస్ అందించాడు.ఆయన ఓలా స్కూటర్లు తయారు చేసి, మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు.

వాటిని మార్కెట్‌లోకి తీసుకు రాకముందే ప్రీ బుకింగ్ కింద లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి.అంతలా మార్కెట్‌లో ఈ స్కూటర్లకు డిమాండ్ ఏర్పడింది.

ఈ తరుణంలో బుకింగ్ పెట్టిన స్కూటర్ రాగానే కొందరు విద్యార్థుల సంబరాలు అంబరాన్నంటాయి.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఓలా కంపెనీ సీఈఓ భవీష్ అగర్వాల్ ఇటీవల ఓ వీడియో షేర్ చేశారు.ఓలా ఎస్ 1 మోడల్ ఆర్డర్ పొందగానే యువతీయువకుల సంబరాలు చేసుకున్న వీడియో పోస్ట్ చేశారు.

అందులో ఓలా స్కూటర్ మధ్యలో ఉండగా, గొబ్బెమ్మ చుట్టూ గంతులేసినట్లు చుట్టూ తిరుగుతూ యువతీ యువకులు పాటలు పాడారు.దానిని చూస్తే ఏదో భోగి మంటలాగానో, గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతున్నట్టుగానో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

తమ స్కూటర్‌కు ప్రజల్లో ఉన్న డిమాండ్ అలాంటిదని చెప్పేందుకే భవీష్ ఈ వీడియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.ఓలా ఎలక్ట్రిక్ సంస్థ గత సంవత్సరం భారతీయ మార్కెట్లో ఎస్1 మోడల్‌ను ప్రవేశపెట్టింది.దీని ఎక్స్ షోరూం ధర రూ.1,29,999గా నిర్ణయించింది.దీనికి వైర్‌లెస్ బ్లూటూత్ స్పీకర్‌లు ఉన్నాయి.అంతే కాకుండా ఎస్1 ప్రో ట్విన్ ఫిజికల్ స్పీకర్‌లు ఉన్నాయి.దీని వల్ల రైడ్ చేసేటప్పుడు మ్యూజిక్ వినొచ్చు.అంతేకాకుండా ఓలా ఎస్ 1 ప్రో స్కూటర్ గంటకు 115 కి.మీ.గరిష్ట వేగం వెళ్తుంది.ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 135 కి.మీ.దూరం ప్రయాణించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube