అబ్బాయికి ఓవైపు రొమ్ము వచ్చింది ... ఎలా అంటే

మనిషి శరీరం హార్మోన్ల మాయం.మన నవ్వినా అది హార్మోన్ల ప్రభావమే, ఏడ్చినా హార్మోన్ల ప్రభావమే, నిద్రపోయినా కూడా అది హార్మోన్ల ప్రభావమే.

 Teen Boy In China Had One Breast Like A Girl-TeluguStop.com

మగవారికి మీసం, గడ్డం పెరుగుతాయి అంటే అది హార్మోన్ల ప్రభావమే, వీర్యం ఉత్పత్తి అవుతోంది అంటే అది హార్మోన్ల ప్రభావమే, గొంతు గట్టిగా ఉంది అంటే కారణం హార్మోన్లే.అమ్మాయిలకు జుట్టు ఒత్తుగా, పెద్దగా పెరుగుతుంది అంటే అది హార్మోన్ల వలనే, గొంతు కోమలంగా ఉంటుంది అంటే కూడా అది హార్మోన్స్ వలనే.

ఇలా మన శరీరంలో జరిగే ప్రతి మార్పుకి కారణం హార్మోన్స్ అలాగే ఆడ – మగల మధ్య ఇన్ని తేడాలు కూడా కారణం హార్మోన్స్.కాబాట్టి హార్మోన్స్ ల మధ్య సముల్యత ఉండాలి.

ఏది కూడా ఎక్కువ అవకూడదు, ఏది కూడా తక్కువ అవకూడదు.అప్పుడే మనిషి మామూలుగా ఉంటాడు.

తేడా జరిగితే ఏం జరుగుతుందో చైనాకి చెందినా 19 ఏళ్ల అబాయి షియో ఫెంగ్ ని అడగండి మీకు వివరంగా చెబుతాడు.

వయసుకి రావడానికి ముందు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా పెద్దగా తేడాలు ఉండవు.

ఎప్పుడైతే ఓ వయసుకి (13-15) వస్తారో, క్రమంగా శరీరంలో మార్పులు మొదలవుతాయి.అమ్మాయిలకి రొమ్ములు పెరుగుతాయి.

అబ్బాయిలకు కూడా ఛాతి భాగం ఉబ్బుగా మారినా, రొమ్ము ఆకారంలోకి వెళ్ళదు ఛాతి.ఫ్లాట్ గానే ఉంటుంది.

కాని 13 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు షియో ఫెంగ్ ని అలా కాకుండా రొమ్ము పెరిగింది.రెండువైపులా పెరిగితే అది వేరే విషయం, ఓవైపు మగవాడిలా ఛాతి, మరోవైపు ఆడవారిలా రొమ్ము.

దాంతో వీడు సగం ఆడ, సగం మగ అంటూ బయట ఎగతాళి మొదలైంది.తన సమస్య ఏమిటో, తనకు ఇలా ఎందుకు జరిగిందో పాపం ఆ వయసులో తనకి తెలిదు.

Teen Boy in China had one breast like a girl -  Teen Boy In China Had One Breast

ఆ తరువాత డాక్టర్లు చెప్పారు ఇది హార్మోన్స్ ప్రభావం అని.మీకు తెలిసిన విషయమే, మగవారిలో టేస్టోస్టేరోన్ అనే హార్మోన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది.మగవారిలో వచ్చే అన్ని మార్పులకి ఈ హార్మోనే కారణం.అలాగే స్త్రీలలో కూడా ఓ ప్రధానమైన హార్మోన్ ఉంటుంది.అదే ఒస్ట్ట్రేజన్.ఇక్కడ విషయం ఏమిటంటే మగవారిలో ఒస్ట్ట్రేజన్, ఆడవారిలో టేస్టోస్టేరోన్ చాలా తక్కువగా ఉత్పత్తి అవుతుంది.

కాని కొందరిలో తమ లింగానికి వ్యతిరేకమైన హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి.అందుకే కొందరి స్త్రీలకు ఫేషియల్ హెయిర్ రావడం చూస్తుంటాం మనం.ఇప్పుడు ఈ అబ్బాయికి జరిగింది అదే.తన శరీరంలో టేస్టోస్టేరోన్ కంటే ఎక్కువగా ఓస్ట్రేజన్ విడుదల అవడం వలన అతనికి ఓవైపు రొమ్ము పెరిగింది.ఇలాంటి కండిషన్ ని gynecomastia అని అంటారు.

ఆరు సంవత్సరాలు ఇదే కండీషన్ తో ఉన్న ఈ టీనేజర్ మొత్తానికి 19 ఏళ్ళు వచ్చాక సర్జరీకి వెళ్ళాడు.

అతడికి కుడిమవైపు ఉన్న రోమ్ముని తీసేశారు డాక్టర్లు.అతడి ఛాతి ఇప్పుడు సగం స్త్రీలా, సగం పురుషుడిలా లేదు పూర్తిగా అబ్బాయిలానే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube