టెక్నాలజీ: సరికొత్త అదిరిపోయే ఫీచర్ ను తీసుకురాబోతున్న వాట్సాప్..!

ప్రస్తుత రోజులలో ఎవరు కూడా  ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను వినియోగించకుండా ఉండని వారు ఉండరు ప్రతి చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ద్వారా అనేక సౌకర్యాలను పొందుతూఉన్నారు.ఈ క్రమంలో ఎప్పటికప్పుడు ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త ఫీచర్లను యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకొని వస్తూనే ఉంటుంది.

 Technology: Whatsapp Is Going To Bring The Latest Creepy Feature  Whatsup, New U-TeluguStop.com

ఈ క్రమంలో తాజాగా ప్రముఖ మెసేజ్ యాప్ స్నాప్ చాట్ కు పోటీగా వాట్సప్ సరికొత్త ఫీచర్ ను ప్రవేశ  పెట్టబోతోంది ఆ ఫీచర్  ఏమిటా అని అనుకుంటున్నారా ? అదేనండి సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్ ఫొటోస్ అండ్ వీడియో ఫీచర్ ప్రస్తుతం ఈ సరికొత్త ఫీచర్ కేవలం బీటా ఆండ్రాయిడ్ వర్షన్ లో మాత్రమే అందుబాటులోకి తీసుకొని వచ్చింది.ప్రస్తుతం ఈ సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్  ఫీచర్ పై వాట్సాప్ టెస్టింగ్ చేస్తుందని WABetaInfo అధికారికంగా సోషల్ మీడియా ద్వారా తెలియ చేసింది ఈ అప్డేట్ అతి త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు సమాచారం వాట్సాప్ లో మరింత ప్రైవసీ కోరుకునే యూజర్ల కోసం ఈ  ఫ్యూచర్ అందుబాటులోకి తీసుకొని వస్తున్నట్లు సంస్థ పేర్కొంటుంది.

ఈ  సెల్ఫ్ డిస్ట్రెక్టింగ్ లో ఫోటోలు,  వీడియోలు ఎవరైనా సరే స్నాప్ షాట్‌లో స్క్రీన్ షాట్ తీసేందుకు ప్రయత్నం చేసిన యూజర్స్ కి వెంటనే నోటిఫికేషన్ వెళ్తుందని, అలాగే మీ ప్రైవేట్ కంటెంట్ ను  ఎవరైనా సేవ్ చేసుకున్నట్లయితే వాళ్ళకు నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు.దీనితో మీరు పంపిన ఫోటోలు లేదా వీడియోలు ఇతరులు ఒక్కసారి మాత్రమే ఓపెన్ చేయగలరని రెండోసారి ఓపెన్ చేయడానికి వీలు పడదని తెలిపారు.

ఈ సరికొత్త ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ వాట్సప్ యూజర్లకు అధికారికంగా అందుబాటులోకి వస్తుందో లేదో అన్న విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.ప్రస్తుతానికి మాత్రం ఈ సరికొత్త ఫ్యూచర్ లో వాట్సాప్ బీటా వెర్షన్ డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవచ్చు అని వాట్సాప్ సంస్థ పేర్కొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube