టెక్నాలజీ: గోడల వెనక ఏముందో చెప్పేస్తున్న యంత్రం..!

మీకు తెలుసా.మనం ఏదన్నా మాట్లాడుకుంటున్నప్పుడు మన పెద్దవాళ్ళు మనకి చెబుతూ ఉంటారు.

 Technology The Machine That Tells What Is Behind The Walls-TeluguStop.com

నెమ్మదిగా మాట్లాడండి గోడకు చెవులు ఉంటాయని అంటూ ఉంటారు.అయితే అది అప్పటి మాట.ఇప్పుడు ఇంకో మాట కూడా మీకు తెలియాలి గోడకు చెవులే కాదండోయ్.ఇప్పుడు కళ్ళు కూడా వచ్చేస్తున్నాయంటున్నారు ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు.

గోడకు కళ్లు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా.? మీరు విన్నది నిజమే ఒక్కోసారి శత్రువులు ఎదుటివారిని దాడి చేసే క్రమంలో గోడ పక్క నక్కి నక్కి ఉంటారు కదా.అలాంటి శత్రువులను గుర్తించగలిగే పరికరాన్ని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.ఈ పరికరం పేరు Xaver LR40 (XLR40).

 Technology The Machine That Tells What Is Behind The Walls-టెక్నాలజీ: గోడల వెనక ఏముందో చెప్పేస్తున్న యంత్రం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ పరికరాన్ని వచ్చే వారం పారిస్‌లో జరగనున్న మిలిటరీ ఎక్స్‌పోలో మొదటిసారిగా ప్రదర్శిస్తామని తెలిపారు.

ఈ పరికరం 50 మీటర్లు అంటే దాదాపు 164 అడుగుల దూరంలో గోడ వెనుక దాక్కున్న వ్యక్తులను గుర్తించగలిగే సామర్థ్యం కలదట.XLR40 పరికరం బరువు కూడా తక్కువ.ఈ పరికరం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే.

ఇది గోడ వెనుక దాగి ఉన్న శత్రువుల ఉనికితో పాటు ఎంతమంది గోడ వెనుక దాక్కున్నారు అనే విషయాన్ని కూడా చెప్పగలదట.అలాగే వారి హృదయ స్పందన ఆధారంగా అల్ట్రా-వైడ్ బ్యాండ్ ని ట్రాక్ చేసి గోడ వెనుక దాక్కున్న శత్రువును ఈ టెక్నాలజీ గుర్తిస్తుంది.

అల్ట్రా వైడ్ బ్యాండ్ అనేది రేడియో టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది.

Telugu Latest News, New Technology, New Updates, News Viral, Viral Latest-Latest News - Telugu

ఈ పరికరం ద్వారా సైనికులు శత్రువుల జాడను ఈజీగా కనిపెట్టవచ్చు.ముఖ్యంగా ఈ టెక్నాలజిని రెస్క్యూ ఆపరేషన్‌ లో ఉపయోగపడుతుంది.ఈ సందర్భంగా కమారో సీఈఓ అమీర్ బెర్రీ మాట్లాడుతూ.“మొదటిసారి XLR40 వ్యవస్థను ప్రవేశపెట్టినందుకు మేము ఎంతగానో గర్వపడుతున్నాము.అతి తక్కువ బరువు ఉండడం వలన ఈ పరికరాన్ని వాహనం లోపల ఉంచవచ్చు.

అలాగే దీనిని ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి కూడా తీసుకుని వెళ్లడంతో పాటు ఇంటెలిజెన్స్ సెర్చ్ ఆపరేషన్స్‌ లో భాగంగా ఈ పరికరాన్ని అపార్ట్‌మెంట్ పైకప్పు పై కూడా ఉంచవచ్చని చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు