టెక్నాలజీ: గాల్లో కాలుష్యాన్ని పీల్చేస్తున్న కార్.. ఎలా అంటే.?

ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో పర్యావరణ కాలుష్యం కూడా ఒకటి అని చెప్పాలి.అలాంటి కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక సరి కొత్త కారు మన ముందుకు వచ్చేసింది.

 Technology: The Car That Calls Pollution In The Gall   How Is Tha  Technology, A-TeluguStop.com

ఈ కారు పర్యావరణంలో ఉన్న కాలుష్యాన్ని పీల్చేస్తుందట.ఏంటి ఆశ్చర్య పోతున్నారా.? కార్ ఎక్కడన్నా కాలుష్యాన్ని వదులుతుంది కానీ కాలుష్యాన్ని పీల్చుకుంటుందా అని ఆలోచిస్తున్నారా.? కానీ మీరు విన్నది నిజమే.ఈ ప్రత్యేకమైన కారు నడుస్తున్నంత సేపు గాల్లోని కాలుష్యాన్ని లాగేసుకుంటుంది.బ్రిటన్ కి సంబందించిన ఒక కంపెనీ పొల్యుషన్ పీల్చుకునే ఈ కొత్త కారును తయారుచేసింది.ఈ కారును ప్రముఖ డిజైనర్ థామస్ హీథర్ విక్ అనే వ్యక్తి ఈ మోడ్రన్ కారును తయారు చేయడం జరిగింది.ఈ పొల్యుషన్ కారును షాంఘైలో జరిగిన గుడ్ వుడ్ ఫెస్టివల్ అఫ్ స్పీడ్ ఈవెంటులో ప్రదర్శించారు.

అలాగే ఇలాంటి మోడరన్ కార్లను 2023 లోపు 10 లక్షల వరకు తయారుచేయడమే తన ముందు ఉన్న ద్యేయం అని థామస్ అన్నారు.

ఒక కాలుష్య నివారణకు మాత్రమే కాకుండా అంతరిక్ష సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కూడా ఈ రాడికల్ డిజైన్ తయారుచేసినట్టు తెలిపారు.

అయితే ఈ కొత్త కారును తయారు చేసినందుకు గాను థామస్ బాగా పాపులర్ అయ్యారు.అలాగే కాలుష్యాన్ని పీల్చుకునే ఈ కారు ఎలా వాతావరణంలోని కాలుష్యాన్ని పీల్చుకుంటుందో థామస్ వివరించారు.

ఈ కారు మాములు కారును పోలి ఉండదు.ఈ కారుకు పైన పెద్ద గ్లాస్​ రూఫ్​ ఉంటుంది.

అలాగే కారు లోపల భాగంలో ఒక పెద్ద గది మాదిరిగా ఉంటుందట.

Telugu Car, Latest-Latest News - Telugu

ఇక ఆ గదిలో మనం నచ్చినట్టు కూర్చోవడానికి అడ్జస్టబుల్​ చైర్లు కూడా ఉంటాయట.రూమ్ అంటే బెడ్ కూడా ఉండాలి కదా.అని మీ మనుసులో ఒక ప్రశ్న మెదులుతూ ఉండవచ్చు.మరి అలంటి ప్రశ్నకు సమాధానంగా ఈ కార్ నిద్రపోయేందుకు బెడ్ కూడా అందుబాటులో.అలాగే ఈ కారులో మీటింగ్స్ తో పాటు భోజనం కూడా చేసేందుకు ఒక టేబుల్​ కూడా ఉంది.

కారు ముందు భాగంలో గ్రిల్ వద్ద టెన్నిస్ బాల్ సైజ్​ లో ఫిల్టర్ అమర్చారు.ఈ ఫిల్టర్లు గాల్లో కాలుష్యాన్ని పీల్చుకుంటాయి.ఏడాదిలోగా టెన్నిస్ బాల్ సైజులో పొల్యూషన్​ ను స్టోర్ చేస్తుంది.ఇలాంటి కార్లు కనుక మరిన్ని అందుబాటులోకి వస్తే వాతావరణ కాలుష్యం అనేది తగ్గుతుందని థామస్ హీథర్​విక్ అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube