టెక్నాలజీ: గూగుల్ నుంచి రాబోతున్న అదిరిపోయే చాటింగ్ యాప్..!

టెక్ దిగ్గజం గూగుల్ సంస్థ నుండి స్మార్ట్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే శుభవార్త తెలిపింది.ప్రపంచంలో ఎంతో మంది ఎదురు చూస్తున్న చాటింగ్ యాప్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది.

 Technology Google To Bring New Chatting App Google Chat-TeluguStop.com

ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఉన్న హ్యాంగ్ ఔట్స్ ను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో గూగుల్ అభిమానులకు కాస్త నిరాశ పరిచిందిని చెప్పవచ్చు.తాజాగా గూగుల్ చాట్ అనే పేరుతో గూగుల్ సంస్థ కొత్తరకమైన యాప్ ను మొదలు పెట్టింది.

మొదట దీన్ని కార్పొరేటర్ లెవెల్ లో పరిమితం చేసిన ఆ తర్వాత ఏప్రిల్ మాసం నుండి గూగుల్ చాట్ డెస్క్ టాప్ వర్షన్ తో పాటు మొబైల్ వర్షన్ కూడా గూగుల్ పరీక్షిస్తుంది.ఇందులో చాలా వరకు సక్సెస్ అవడంతో ఇప్పుడు పూర్తిగా రంగం సిద్ధం చేస్తోంది.

 Technology Google To Bring New Chatting App Google Chat-టెక్నాలజీ: గూగుల్ నుంచి రాబోతున్న అదిరిపోయే చాటింగ్ యాప్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందుకు సంబంధించి ఈ యాప్ ను ముందుగా ఐప్యాడ్, ఐఫోన్ యూజర్లకు గూగుల్ చాట్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.దీంతో ఆపిల్ యూజర్లు ఫ్లాట్ఫామ్ ను వాడేసుకోవచ్చు.

ఇది వరకు మనం జిమెయిల్ లో ఉన్న ఎకో సిస్టంలో గమనిస్తున్న మెయిల్, మీట్, రూమ్స్ మాదిరిగానే చాట్ ఆప్షన్ కూడా మనకు కనిపించబోతోంది.ఇదివరకు కేవలం కార్యాలయాలు ఉపయోగార్ధం వినియోగించిన ఈ చాట్ ఇప్పుడు ప్రతి ఒక్కరికి అందబోతుంది.

ఇక ఈ యాప్ కింది వరుసలో జిమెయిల్ చాట్, మీట్, రూమ్స్ లాంటి అనేక ఆప్షన్లు కనబడుతున్నాయి.

Telugu Android Users, Chat Rooms, Gamil, Gmail Chat, Good News, Google Chat, Google Chat Features, Google New App, Google Users, Hangouts, Latest Version, Meet, New Feature, New Update, Technology-Latest News - Telugu

కేవలం ఆ పిల్లలకు మాత్రమే కాకుండా ఈ యాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కూడా గూగుల్ రంగం సిద్ధం చేసింది.అయితే వీటిని వాడాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే.ఇంతవరకు గూగుల్ అందించిన హ్యాంగ్ అవుట్స్ కంటే చాట్ యాప్ ఆండ్రాయిడ్ యూజర్లు ఎక్కువగా ఆస్వాదిస్తారని గూగుల్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వీటిని వాడాలంటే మీ మొబైల్ లో కచ్చితంగా జిమెయిల్ యాప్ సంబంధించి లేటెస్ట్ వర్షన్ కచ్చితంగా ఇన్స్టాల్ చేసి ఉండాలి.ఒకవేళ ముందటి వర్షన్ జిమెయిల్ యాప్ వాడుతుంటే ప్లేస్టోర్ లోకి వెళ్లి కచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిందే.

#Gamil #Google Chat #GoogleChat #Technology #Google New App

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు