టెక్నాలజీ: ఆ విషయంలో కొత్త టెక్నాలజీ తీసుకురాబోతున్న గూగుల్..!

మనకు ఎలాంటి సమాచారం కావాలన్నా గూగుల్ లో సెర్చ్ చేస్తాం.గూగుల్ కూడా మన అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తీసుకొస్తూ ఉంటుంది.

 Technology Google Is Going To Bring New Technology In That Regard-TeluguStop.com

అయితే గూగుల్ త్వరలోనే కలర్ ఫుల్ యూజర్‌ ఇంటర్‌ ఫేస్‌ ను విడుదల చేయనుందట.ఇందులో రంగురంగుల డార్క్ థీమ్ ను తీసుకురానుందంట.గూగుల్‌ యూఐ దాని విజువల్‌ రిఫ్రెష్‌ ను 2019 చివరిలో చివరిసారిగా రోల్‌ అవుట్‌ చేసింది.2020 ఏడాది ప్రారంభంలో దానిని అందుబాటులోకి తీసుకొచ్చింది.ఇప్పుడు ఈ రంగురంగుల యూఐ ను త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది.

ఎక్స్‌డీఏ- డెవలపర్ టిప్‌స్టర్ మాథ్యూ పిర్సజెల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

 Technology Google Is Going To Bring New Technology In That Regard-టెక్నాలజీ: ఆ విషయంలో కొత్త టెక్నాలజీ తీసుకురాబోతున్న గూగుల్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గూగుల్ అసిస్టెంట్ తన థీమ్స్ ​కు కొత్త రంగులను యాడ్ చేయనుంది.ఇలా చేయడం వల్ల మొబైల్ ఫోన్​ఆపరేషన్​ కలర్​ఫుల్​ గా ఉండనుంది.

దీని ద్వారా స్మార్ట్​ ఫోన్​ వాడే వారు ఫోన్ ను వాడే సమయంలో సరికొత్త ఎక్స్పీరియన్స్ ను చూస్తారు.బయట ఉన్న లైటింగ్​, వాతావరణ ​పరిస్థితులను​ బట్టి గూగుల్ అసిస్టెంట్ దానికదే థీమ్​ రంగులను చేంజ్ చేస్తుంది.

ఈ అప్‌డేట్‌ ఆండ్రాయిడ్​ 12 మోనెట్ థీమింగ్‌ లా ఉంటుందని ఎక్స్‌డీఏ పేర్కొంది.ఆండ్రాయిడ్ 12తో పని చేసే స్మార్ట్ ​ఫోన్లను వాడేవారు తమకు ఇష్టమైన వాల్‌ పేపర్​ లో నుంచి ఇష్టమైన కలర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

మోనెట్ థీమింగ్ ​సిస్టమ్ నోటిఫికేషన్ బ్యాక్​ గ్రౌండ్, క్విక్​ సెట్టింగ్‌ యాక్సెంట్, సెట్టింగ్స్​ పేజీ, లాక్‌ స్క్రీన్‌ వంటి బ్యాక్​ గ్రౌండ్ ​లకు ఆటోమేటిక్​గా కలర్స్​ ను చేంజ్ చేస్తుంది.

థీమ్స్ చేంజ్ చేసుకునే ఫీచర్లు ఇప్పటికే సోనీ ఎక్స్‌పీరియా కంపెనీ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయని టిప్ ​స్టార్ ​పేర్కొంది.గూగుల్ అసిస్టెంట్​ ఇటీవలే మరో 3 కొత్త ఫీచర్లను యాడ్ చేసింది.వాయిస్ ను ఆధారంగా చేసుకుని ​అసిస్టెంట్ ​అనే కొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ ఫీచర్ల ద్వారా వ్యక్తుల సంభాషణలను బట్టి వారిని ఐడెంటిఫై చేస్తుంది.వినియోగదారుడి కాంటాక్ట్​ లిస్ట్​ లోని పేర్లను చెబుతుంది.రికార్డు చేయకపోయినా మీ గొంతును, ఉచ్ఛారణను ఐడెంటిఫై చేస్తుంది.ప్రస్తుతం ఈ ఫీచర్ ఇంగ్లీష్ ​లో మాత్రమే అందుబాటులో ఉంది.

గూగుల్ ఈ ఫీచర్ ను అన్ని లాంగ్వేజీల్లోకి తీసుకురావాలని అనుకుంటోంది.

#Technology #GoogleAssisentm #New Technology #Dark Theme

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు