టెక్నాలజీ: అందుబాటులోకి వచ్చిన "ఫేస్ పే".. ఎలా పనిచేస్తుందంటే..?!

సాధారణంగా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి, బిల్లులు కట్టడానికి ఫోన్ పే, జీ పే వాడడం విన్నాం కానీ ఎప్పుడైనా ఫేస్ పే గురించి ఎప్పుడైనా విన్నారా.? ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే సాధారణంగా రైలు బస్సు మెట్రోరైలు విమానాల్లో ముందుగా టికెట్లు బుక్ చేసుకుంటాం లేదా అప్పటికప్పుడు స్టేషన్లో టిక్కెట్లు అనుకుంటూ ఉంటాం.వీటికోసం మనం ఫోన్ పే, జీ పే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లాంటి వాటిని వాడుతూ ఉంటాము.అయితే ఇకనుంచి మెట్రోలో ఎక్కాలంటే కార్డులు ఫోన్ పే లు కాకుండా ఫేస్ ఫే అందుబాటులోకి వచ్చింది.

 Technology Available Face Pay How Does It Work-TeluguStop.com

ఇంతకీ ఫేస్ పే ఎందుకు ఎక్కడ వాడతారో తెలుసుకుందాం.

ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా రాజధాని మాస్కో మెట్రోలో ఫేస్ రీడింగ్ ద్వారా చెల్లింపులు చేసే కల్పించింది.

 Technology Available Face Pay How Does It Work-టెక్నాలజీ: అందుబాటులోకి వచ్చిన ఫేస్ పే.. ఎలా పనిచేస్తుందంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీని ద్వారా నగదు రహిత కార్డు గ్రహీత గ్రహీత సిస్టం పేస్ పే మాస్కో మెట్రోలో ప్రవేశపెట్టింది.ఫేషియల్ ఐడి ద్వారా చెల్లింపులు చేసే ఈ వ్యవస్థను శుక్రవారం 240 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

అయితే ఇలాంటి వ్యవస్థ ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా లేదని మాస్కో రవాణా వ్యవస్థ మాగ్జిమ్ లిస్కుటోవ్ ఓ ప్రకటనలో తెలిపారు.ఫేస్ పై ఉపయోగించుకోవాలి అనుకున్న ప్రయాణికులు ముందుగా వారు ముఖచిత్రాన్ని ఇచ్చి బ్యాంకు కార్డులను మాస్కో మెట్రో ద్వారా అనుసంధానం చేసుకోవాలి.

ఇలా అనుసంధానం చేసుకున్న వారు ఫేస్ పే ద్వారా మెట్రో స్టేషన్లో ప్రత్యేక టర్న్ స్టైల్ వద్ద ఒకసారి కెమెరాని చూసి మెట్రో లో ఎక్కాల్సి ఉంటుంది.

కొన్నాళ్ల క్రితం మాస్కోలో ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా వీడియో నిఘా వ్యవస్థను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన విషయం తెలిసింది.

అందరికీ తెలిసిందే.అయితే కోవిడ్ సమయంలో జనం విచ్చలవిడిగా తిరగకుండా నియంత్రించడం, అలాంటి వారిని గుర్తించి క్వారంటైన్ కు తరలించడం, రాజకీయ ర్యాలీలకు హాజరైన నిరసన కారులను గుర్తించడం, వారిని అరెస్టు చేసేందుకు కూడా ఈ వీడియో నిఘా వ్యవస్థ ఉపయోగపడిందని పోలీస్ అధికారులు తెలిపారు.అయితే ఈ వ్యవస్థ ప్రజల గోప్యతను, మానవ హక్కులను దెబ్బతీసేదిగా ఉందని డిజిటల్ హక్కుల సంఘాలు ఆందోళన చేశాయి.2018 మాస్కోలో సాకర్ వరల్డ్ కప్ నిర్వహించినప్పుడు నేరస్తులను గుర్తించడానికి ఈ వ్యవస్థను అభివృద్ధి చేసినట్టు మాస్కో మేయర్ కార్యాలయం తెలిపింది.కానీ ఫేస్ పే వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రయాణికుల డేటా సురక్షితంగా ఉంటుంది అని, అందుకే ఈ వ్యవస్థను ఫేస్ పే చేసేందుకు పోలీసులు అనుమతించారని మాస్కో మెట్రో అధికారులు చెబుతున్నారు.

#Credit #Face Pay #Method

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube