Cotton Crop : పత్తి పంటలో కలుపు నివారణలో పాటించాల్సిన మెళుకువలు..!

భారతదేశంలో వరి తర్వాత అత్యధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న రెండవ పంటగా పత్తి పంట నిలిచింది.పత్తి పంటకు చీడపీడల, తెగుళ్ల బెడద కాస్త ఎక్కువ.

 Cotton Crop : పత్తి పంటలో కలుపు నివారణ-TeluguStop.com

కాబట్టి పత్తి పంట( Cotton Crop ) సాగు చేయాలి అనుకునే రైతులు ముందుగా పత్తి పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకోవాలి.అప్పుడే పంటను ఎప్పటికప్పుడు సంరక్షించుకుంటూ ఉంటూ ఆశించిన స్థాయిలో అధిక దిగుబడులు( High yields ) పొందవచ్చు.

పత్తి పంటలో అధిక దిగుబడులు సాధించాలంటే.పత్తి పంట సాగు చేసే నేల తయారీ, మేలు రకం విత్తనాలు, పోషక ఎరువులతో పాటు కలుపు నివారణ కూడా అత్యంత కీలకం.

Telugu Agriculture, Cotton Crop, Farmers, Yields, Cost, Weed Control-Latest News

పత్తి పంటలో కలుపు సమస్య తక్కువగా ఉంటే పెట్టుబడి వ్యయం( Investment cost ) కూడా చాలా వరకు తగ్గుతుంది.ఎందుకంటే.పత్తి పంటను ఆశించే చీడపీడలకు, తెగుళ్ళకు కలుపు మొక్కలే అతిథి మొక్కలు.వీటి వ్యాప్తి కూడా చాలా వరకు కలుపు మొక్కల ద్వారానే జరుగుతుంది.కాబట్టి పత్తి పొలంలో కలుపును నివారించడం కోసం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి.పత్తి పంట పెట్టుబడి వ్యయం పెరగడానికి కలుపు కూడా కీలక పాత్ర వహిస్తుంది.

పత్తి పంట వేయడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.వేసవికాలంలో పదేపదే లోతు దుక్కులు దున్ని నేలలో తేమ లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి.

నేలలో తేమ లేకపోతే కలుపు విత్తనాలు దాదాపుగా నాశనం అవుతాయి.

Telugu Agriculture, Cotton Crop, Farmers, Yields, Cost, Weed Control-Latest News

ఇక పత్తి పంట విత్తడానికి కనీసం వారం రోజుల ముందు గడ్డి మందులను నేల పూర్తిగా తరిచేటట్లు పిచికారి చేయాలి.పత్తి మొక్కలు ఎదుగుతున్న సమయంలో గడ్డి మందులను పిచికారి చేయకూడదు.ఒకవేళ పిచికారి చేస్తే ఎదిగే మొక్కలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

ఇక పత్తి మొక్కలు సుమారుగా మూడు అడుగులు పెరిగిన తర్వాత నాగలితో అంతర కృషి చేయాలి.మొక్కల సాలులలో ఉండే కలుపు మొక్కలను కూలీలతో తొలగించాలి.కలుపు మొక్కలు విత్తన దశకు రాకముందే తొలగిస్తే కలుపు సమస్య దాదాపుగా ఉండదు.కలుపు మొక్కలను తొలగిస్తే మొక్కలకు అన్ని పోషకాలు సక్రమంగా అందుతాయి.

కాబట్టి రైతులు ఏ పంటను సాగు చేసినా కలుపు నివారణ యాజమాన్య పద్ధతులను మెళుకువలతో పాటించాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube