మొహంజోదారో నాటి టెక్నిక్.. బావిలో నుంచి బయటపడ్డ చిరుత

అడవి జంతువులకు మనుషులు ఇబ్బంది కలిగిస్తున్నారు.అవి నివాసముండే అడవులను క్రమంగా ఆక్రమించేస్తున్నారు.

 Technique From Mohanjodaro Leopard Scared Out Of The Well , Well, Leopard ,chetah, Viral Latest, News Viral, Social Media , Technique From Mohanjodaro-TeluguStop.com

ఫలితంగా ఉండడానికి, తినడానికి ఇబ్బందులు పడుతూ అడవి జంతువులు ఇళ్లల్లోకి వచ్చేస్తున్నాయి.ఇటీవల ఏపీలోని కాకినాడ జిల్లాలో ఓ పెద్ద పులి స్థానికులను హడలెత్తిస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలో ఆరుగురిని ఓ ఎలుగుబంటి గాయపరిచింది.ఇవి మరువక ముందే విజయనగరం జిల్లాలో ఓ పెద్దపులి సంచరిస్తున్న వైనం ఆందోళన కలిగిస్తోంది.

 Technique From Mohanjodaro Leopard Scared Out Of The Well , Well, Leopard ,chetah, Viral Latest, News Viral, Social Media , Technique From Mohanjodaro-మొహంజోదారో నాటి టెక్నిక్.. బావిలో నుంచి బయటపడ్డ చిరుత-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదే తరహాలో ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చి బావిలో పడిపోయింది.దానిని రక్షించేందుకు హరప్పా మొహంజోదారో నాటి టెక్నిక్ ఉపయోగించారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విటర్‌లో బావిలో పడిన చిరుతను రక్షించిన వీడియోను పోస్ట్ చేశారు.ఈ సంఘటన ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో జరిగింది.ఓ చిరుత పులి అక్కడ బావిలో బయట పడింది.

అందులో నుంచి బయటకు తీసేందుకు ఓ మంచాన్ని నాలుగు వైపులా తాళ్లతో కట్టి కిందికి వదిలారు.దానిపై ఎక్కిన చిరుతను క్రమంగా పైకి లాగారు.

ఆ మంచం బావి పైకి రాగానే చిరుత ఉన్నపళంగా బయటకు దూకింది.అక్కడి నుంచి క్షణాల్లోనే పరుగు పెట్టి మాయమైంది.

అయితే ఈ వీడియోను పోస్ట్ చేయడంతో పాటు ఓ సందేశాన్ని ఆయన ఉంచారు.బావులను పైన ఏమీ కప్పకుండా, రక్షణ చర్యలేవీ తీసుకోకుండా అలాగే వదిలేస్తే ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని ఆయన హెచ్చరించారు.

చిరుత పడిన బావిలో చిన్నారులు పడితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.వీలైనంత వరకు జనావాసాల చుట్టూ ఉన్న బహిరంగ బావులను మూసి వేయాలని సూచించారు.

ఇక ఆయన పోస్ట్ చేసిన వీడియోకు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది.పోస్ట్‌కి 44,000 వ్యూస్, దాదాపు 2,000 లైక్‌లు వచ్చాయి.

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఓపెన్‌ వెల్‌ను మూసేయాలని కొందరు కోరారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube