సాఫ్ట్‌వేర్ కంపెనీల‌కు రిజైన్ చేస్తున్న టెకీలు.. ఎందుకంటే..?

సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే స‌గ‌టు విద్యార్థి క‌ల‌.దాన్ని సాధించేందుకు ఎంత‌లా క‌ష్ట‌ప‌డుతుంటారో అంద‌రికీ తెలిసిందే.

 Techies Resigning To Software Companies Because-TeluguStop.com

త‌మ కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని చెప్పుకునేందుకు త‌ల్లి దండ్రులు ఎంతో మురిసిపోతుంటారు.అలాంటి జాబుల కోసం విద్యార్థులు చేసే ప్ర‌య‌త్నాలు అంతా ఇంతా కాదు.

ఇందులో సెటిల్ అయితే చాలు జీతాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని, జీవితంలో ఎద‌గొచ్చ‌ని, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా ఇందులో ఎదిగేందుకు మంచి అవ‌కాశాలు ఉంటాయ‌ని ప్ర‌తి ఒక్క‌రూ భావిస్తుంటారు.

 Techies Resigning To Software Companies Because-సాఫ్ట్‌వేర్ కంపెనీల‌కు రిజైన్ చేస్తున్న టెకీలు.. ఎందుకంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ అలంటి జాబుల‌కు ఇప్పుడు డిమాండ్ త‌గ్గిపోతోంది.

ఈ రంగం గ‌త ఏడాది నుంచి చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.మిగ‌తా రంగాల్లో కూడా డిజిటల్ టెక్నాలజీ వినియోగం విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో ఆయా రంగాల్లో మంచి జీతాలు కూడా రావ‌డంతో ఈ రంగం నుంచి ఉద్యోగులు ఇత‌ర రంగాల్లోకి వ‌ల‌స‌లకు క్యూ క‌డుతున్నారు.

క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాల‌జీని బేస్ చేసుకుని ఓటీటీ ఏఐ లాంటి టెక్నాలజీలో గ‌ట్టి ప‌ట్టున్న ఉద్యోగుల‌కు ఇత‌ర రంగాల్లోనే ఎక్కువ సాల‌రీ రావ‌డం కూడా ఇందుకు ప్ర‌ధాన కార‌ణం.

Telugu Cloud Computing, Corona, Digital Technologies, It Companies, It Techies, Resign Software Jobs, Software Employees, Startups-Latest News - Telugu

దీంతో పాటు క‌రోనా మ‌హ‌మ్మారి లాంటి విప‌త్తులు రావడంతో అన్ని కంపెనీల్లో వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ న‌డుస్తున్నాయి.దీంతో ప‌ని భారాన్ని త‌ట్టుకోలేక‌పోవ‌డంతో పాటు ఉద్యోగ భ‌ద్ర‌త కూడా త‌గ్గిపోవడంతో చాలామంది ఐటీ సెక్టార్‌ను విడిచిపెట్టి సొంతంగా ఏదైనా స్టార్ట‌ప్ కంపెనీని పెట్టాల‌ని చూస్తున్నారంట‌.ఇందుకోసం ఉద్యోగాన్ని వ‌దిలేసి ఏదైనా బిజినెస్ పెట్టుకోవాల‌ని చాలామంది చూస్తున్నారంట‌.

ఇందులో భాగంగానే ఈ ఏడాదిలో చాలా వ‌ర‌కు ఉద్యోగులు ఐటీ కంపెనీల నుంచి బ‌య‌ట‌కు వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది.ఏదేమైనా ఇది కొత్త త‌రానికి అవ‌కాశాన్ని ఇచ్చే అంశం.

కొత్త జ‌న‌రేష‌న్ స్టూడెంట్ల‌కు అవ‌కాశాలు దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంద‌ని చెబుతున్నారు నిపుణులు.

#Tups #Cloud #Corona #ResignSoftware

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube