దుబారా ఖర్చు చేసిన భార్య.. ఫుల్‌స్టాప్ పెట్టిన భర్త

భార్య వృథాగా దుబారా ఖర్చులు చేస్తుందని, ఎంత మొత్తుకున్నా ఆమె వినడం లేదని ఓ భర్త తీవ్ర మనస్తాపానికి గురై తన జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టిన ఘటన బెంగుళూరు నగరంలో చోటు చేసుకుంది.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనాథ్(39) తన భార్య రేఖ చేస్తున్న దుబారా ఖర్చులను మానుకోవాలని పలుమార్లు ఆమెకు సూచించాడు.

 Techie Commits Suicide Due To Wife Harassment-TeluguStop.com

అయినా రేఖ తన భర్త మాటలు పెడచెవిన పెట్టి దుబారా ఖర్చులు చేస్తూ విలాసవంతమైన జీవితం జీవించాలని ప్రయత్నించింది.అంతేగాక తనకో ఫ్లాట్ కావాలని, అది తన తండ్రి పేరుమీద రిజిస్టర్ చేయించాలని శ్రీనాథ్‌ను వేధించింది.

దీంతో శ్రీనాథ్ భార్య వేధింపులు తట్టుకోలేక బ్యాంక్ రుణాలు తీసుకున్నాడు.అయినా కూడా తన భార్య వేధింపులు ఆగకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.

దీంతో అతడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.కాగా శ్రీనాథ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

భార్య రేఖ, ఆమె తల్లిదండ్రులపై 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube