ఇలాంటి ఆటోలను మీరు ఎక్కడన్నా చూసారా? ఆటోపై కెమెరాలు ఎందుకో?

మనకి సాధారణమైన ఆటోల సంగతి తెలిసినదే.అయితే మీరు రోడ్డుపై వెళ్తున్నపుడు ఆటోపై కెమెరాలు ఎపుడైనా కనిపించాయా? ఆటోలపై కెమెరాలు ఎందుకంటే.సదరు ఆటోలు గూగుల్ మ్యాప్స్‌కు మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేసి ఇస్తున్నాయి.ఇటీవల ఇండియాలో గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి వెహికల్స్ ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగుళూరులో కనిపిస్తున్నాయి.

 Tech Mahindra Using Auto Rickshaws To Capture Data For Google Map Street View De-TeluguStop.com

భారతదేశంలో స్ట్రీట్ వ్యూ సేవల్ని అందించేందుకు గూగుల్ మ్యాప్స్… జెనిసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సంస్థలతో తాజాగా ఒప్పందం చేసుకుంది.

నిజానికి గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ సర్వీస్ 10 ఏళ్ల క్రితమే మొదలైనప్పటికీ ప్రభుత్వ రెగ్యులేషన్స్ కారణంగా భారతదేశానికి ఈ సేవలు చాలా ఆలస్యంగా వచ్చాయి.

బేసిగ్గా ఫారిన్ కంట్రీలలో ఇలాంటి ఆటోలు మనకు విరివిగా కనిపిస్తుంటాయి.త్వరలో దేశమంతటా ఇలాంటి ఆటోలను తీసుకురానున్నారు.

ఇండియాలో టెక్ మహీంద్రా వీటిని లాంచ్ చేస్తోంది.ఆ ఆటోలు రోడ్లు, వీధుల్లో తిరుగుతూ మ్యాపింగ్ డేటా క్యాప్చర్ చేస్తుంటాయి.

గూగుల్‌కు లైసెన్స్ స్ట్రీట్ వ్యూ డేటా అందించేందుకు టెక్ మహీంద్రా చేపట్టిన ప్రాజెక్టులో భాగంగా ఇలా మహీంద్రా ఆటోలను ఉపయోగిస్తున్నాయని ఆనంద్ మహీంద్రా తాజాగా ట్వీట్ చేశారు.

Telugu Auto Rickshaws, Camerasauto, Capture, Googlemap, Google Maps, Tech Mahind

అయితే, అన్ని ప్రాంతాల్లో ఈ ఆటోలనే ఉపయోగిస్తారా అనే విషయంపైన అధికారిక ప్రకటన రావాల్సి వుంది.భారతీయ రోడ్ల పరిస్థితులు, ప్రాంతాలను బట్టి మహీంద్రా లాజిస్టిక్స్ వేర్వేరు వాహనాలను ఉపయోగిస్తూ ఉండవచ్చు.ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ 10 ప్రధాన నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్ స్ట్రీట్ వ్యూ సేవలు లభిస్తున్నాయి.2022 చివరి నాటికి 50 నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి రానుందని సమాచారం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube