భారత ఉద్యోగికి హెచ్-1బీ నిరాకరణ...సవాల్ చేసిన కంపెనీ..

భారత్ కి చెందిన ఓ ఐటీ నిపుణుడికి అమెరికాలోని ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం వచ్చింది అయితే ఎంతో ప్రతిభ కలిగిన సదరు ఉద్యోగికి అమెరికా ఇమ్మిగ్రేషన్ హెచ్- 1బీ నిరాకరించింది.దాంతో తాము ఎంతో శ్రమించి ఎంపిక చేసిన ఓ నిపుణుడికి ఎందుకు వీసా నిరాకరించారు అంటూ ఆ కంపెనీ అమెరికా ప్రభుత్వంపై స్థానిక కోర్టులో దావా వేసింది.

 Tech Firm Sues Us Govt Over H 1b Denial To Indian Employee-TeluguStop.com

తాజాగా జరిగిన ఈ సంఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.పూర్తి వివరాలలోకి వెళ్తే.

అమెరికాలోని సిలికాన్ వ్యాలికి చెందిన ఐటీ కంపెనీ ఎక్స్‌టెర్రా సొల్యూషన్స్, భారత్ నుంచీ నిష్ణాతుడు అయిన ఓ ఉద్యోగిని తమ సంస్థలోకి తీసుకుంది.బిజినెస్ సిస్టం అనలిస్ట్ గా నియమించిన చంద్ర సాయి వెంకట్ అనిశెట్టి ఎంతో అద్భుతమైన ప్రతిభ కలవాడని పేర్కొంది.

అతడికి వీసా నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.చంద్రసాయి కి ఇచ్చే ఉద్యోగం హెచ్-1 బీ స్పెషాలిటీ ఆక్యుపేషన్ కాదన్న కారణంతో వీసా నిరాకరించారని సంస్థ పేర్కొంది.

భారత ఉద్యోగికి హెచ్-1బీ నిరాకర

ఇదిలాఉంటే తాజాగా ట్రంప్ వీసా విధానంలో చేసిన మార్పుల గూర్చి చెప్తూ ప్రతిభ ఉన్నవారికి తమ ప్రభుత్వం తప్పకుండా అమెరికాలో చోటు కల్పిస్తుందని.అందుకు తగ్గట్టుగానే వలస విధానంలో సమూల మార్పులు చేశామని చెప్పుకుంటున్నారు.కానీ తాజాగా జరిగిన ఈ ఘటనతో ట్రంప్ ప్రవేశపెట్టిన విధానాలు వాస్తవానికి ఎంత మేరకు దగ్గరగా ఉండబోతాయనే ఆందోళనలో ఉన్నారు భారత టెకీలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube