ఆ కంపెనీ సొంత చిప్ ల తయారీ... ప్రకటనలకే పరిమితమా..!?

ప్రపంచలోనే టెక్ దిగ్గజ కంపెనీలైన ‘యాపిల్, అమెజాన్, ఫేస్బుక్, టెస్లా, బైజూ‘ ల గరించి అందరికీ తెలిసిందే.అలాంటి కంపెనీలు తమ ప్రొడక్ట లకు కావాల్సిన చిప్ ల కొరత ఉండడంతో తామే సొంతంగా చిప్ లను తయారు చేస్తామని ఎప్పట్నుంచో ప్రకటిస్తూనే ఉన్నాయి.

 Tech Companies Own Chip Manufacturing Is Going To Happen Or Not,  Micro Soft, Ch-TeluguStop.com

అయితే చిప్ ల తయారీ ఎప్పటికి పూర్తవుతుందో, అసలు తయారీ ప్రకటనలు ఎంతవరకు నిజమో అన్నది తేలడం లేదు.కానీ పీసీ, ల్యాప్, స్మార్ట్ఫోన్, టాబ్లెట్, టీవీ లాంటి ఆలోమొబైల్స్ రంగాల్లో మైక్రోప్రాసెసర్ల (సెమీ కండక్టర్‌ ను ఉపయోగంచడంతో చిప్ లకు డిమాండ్ ఎక్కువగా పెరిగింది.

అయితే కరోనా సమయంలో చిప్ ల ప్రొడక్షన్ తగ్గి కొరత ఏర్పడింది.దీంతో ఉత్పత్తి తగ్గి రేటు ఆకాశానికి అంటాయి.

ఆ ప్రభావంతో చాలా కంపెనీలు చాలా వరకు నష్టపోయాయి.ప్రత్యేక బ్రాండ్లకు ప్రొడక్షన్ ఉన్నా ఎక్కువ రేట్లకు అమ్మెస్తుండడంతో కొన్ని కంపెనీలకు అసహనం పెరిగిపోయింది.

ఈ నేపథ్యంలో ఒక్కో కంపెనీ సొంతగా తామ చిప్ ల తయారీలోకి అడుగుపెడుతున్నట్లు వరుసగా ప్రకటనలు ఇస్తూ వచ్చాయి.దీంతో టెక్ దిగ్గజ కంపెనీలన్నీ సొంతంగా చిప్ ల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నాయన్న వార్తలు ఈ మధ్య కాలంలో బాగా వినిపించాయి.‘గూగుల్‌ లుక్ ల్యావ్యాప్‘ కోసం గూగుల్ సొంతంగా సీపీయూలను తయారు చేయడంలో చివరి దశకు చేరుకుందని, ముఖ్యంగా గూగుల్, యాపిల్ ఈ రేసులో ముందున్నాయని ప్రకటనలు వినిపిస్తున్నాయి.

Telugu Dollars, Apple, Chip, Google, Latest, Micro Soft, Taiwan, Ups, Tsmc-Lates

అయితే సొంత చిప్ ల తయారీ అంత సులువు కాదని, చాలా వ్యయ ప్రయాసలతో కూడిన వ్యవహారమని ఏ లెక్కన చూసినా ప్రొడక్ట్ మార్కెట్లోకి వచ్చేది 2023 చివరికేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.తాజాగా సుమారు 10 బిలియన్ డాలర్ల వ్యయంతో తైవాన్ లో అత్యాధునిక చిప్ ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేయబోతున్నట్లు టీఎస్ఎంసీ కంపెనీ ప్రకటించింది.అయితే పూర్తి స్థాయిలో ప్రొడక్షన్ కోసం ఎన్నేళ్లు పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.

ఈ లెక్కన టెక్ దిగ్గజ కంపెనీలన్నీ ఇప్పుడిప్పుడే చిప్ ల తయారీలోకి సొంతంగా దిగే అవకాశాల్లేవని, పాత ప్రకటనలను తెర మీదకు తెచ్చి కొత్తగా ఎందుకింత పాడావుడి చేస్తున్నాయోనని టెక్ నిపుణులు అంటున్నారు.అయినా ఈ ప్రకటనలు ఆచరణలోకి రాకడానికి ఎంత సమయం పడుతుందో.

ఎప్పుడు అమలవుతుందో చెప్పలేమని నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube