రామ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసిన 'ఇస్మార్ట్ శంకర్' టీమ్  

Teaser Released From \'ismart Shankar\' Movie-director Puri Jagannadh,movie Updates,టీజర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్, పూరి జగన్నాథ్ ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. మంచి మాస్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. పూరి చాలా గ్యాప్ తీసుకొని మంచి హిట్ కొట్టాలన్న ఉద్దేశ్యం తో ఈ చిత్రానికి దర్సకత్వం వహిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో రామ్ కు జోడీ గా నిధి అగర్వాల్,నభా పటేల్ లు కధానాయకులుగా నటిస్తుండగా ఈ చిత్ర చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది..

రామ్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసిన 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ -Teaser Released From 'ismart Shankar' Movie

అయితే ఈ రోజు హీరో రామ్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలియజేస్తూ ఆ చిత్ర బృందం తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేసింది. అయితే ఈ టీజర్ లో రామ్ పాత్ర పూర్తిగా మాస్ ఎంటర్ టైనర్ గా ఉండనున్నట్లు అర్ధం అవుతుంది. మాస్ ఏరియాలో దాదాగిరి చేసే మాస్ లీడర్ శంకర్.

అలాంటి మాస్ క్యారెక్టర్ లో రామ్ ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లు ఆ టీజర్ ను చూస్తే అర్ధం అవుతుంది.

ఈ టీజర్ లో రామ్ పూర్తిగా మాస్ లుక్ తో ఉండడం తో అభిమానుల ను ఈ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ టీజర్ లో రామ్ కొట్టిన డైలాగ్ చూస్తే పూర్తి గా తెలంగాణా యాస తో మాస్ మసాలా గా ఈ చిత్రం ఉండబోతున్నట్లు అర్ధం అవుతుంది.

\”నాతో కిరికిరంటే పోశమ్మ గుడి ముంగట పొట్టేలును గట్టేసినట్టే\” అంటూ రామ్ చెప్పిన డైలాగ్, మాస్ వర్గాన్ని ఆకట్టుకునేలా ఉంది. రామ్ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు ఈ చిత్రం రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసే విధంగా ఈ టీజర్ ఉంది.