క్షణాల్లో ఉల్లి తొక్క తీసేశారు, వైరల్ అవుతున్న వీడియో

ఈ సామజిక మాధ్యమాలు వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ తమలో ఉన్న టాలెంట్ ను బయటపెడుతున్నారు.ఈ టిక్ టాక్ లు వచ్చిన తరువాత ఈజీ గా పనులు చేయడం ఎలా వంటి విషయాల్లో కొంతమందికి సలహాలు ఇస్తూ కొందరు వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.

 Tear Free Onion Peeling Video Goes Viral ,tik Tok,onion Peeling,viral,lockdown,t-TeluguStop.com

ఆమధ్య వెల్లుల్లి తొక్కలు ఈజీగా తీయడం ఎలా అని ఇలా పోస్ట్ చేసారో లేదో అలా బోలెడు లైక్ లు వచ్చేశాయి.అయితే ఇప్పుడు తాజాగా ఉల్లి పాయ తొక్క ఈజీ గా ఎలా తీయొచ్చు అనేదానికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది.

ఇప్పటివరకూ ఉల్లిపాయల తొక్కలు తియ్యాలంటే బలవంతంగా లాగడమో అటు ఇటూ కదపడం ద్వారా పై తొక్కను వదులుగా చేయడమో ఇలా రక రకాల విన్యాసాలు చేస్తుంటాం.నిజానికి ఉల్లి తొక్క తీయడం అంత తేలికేమీ కాదు.

ఒక్కోసారి పై తొక్క తీస్తుంటే… మరో లేయర్ కూడా ఊడొచ్చేస్తుంది.దీనివల్ల ఉల్లి పాయలు కొంత వెస్ట్ అయిపోతుండడం తో పాటు కళ్ల నుంచి నీరు కారి నానా ఇబ్బందులు పడేవారు.

అలా బాధపడేవారి కోసం ఈ వీడియో బాగా పనికి వస్తుంది.చాలా ఈజీ గా ఉల్లి తొక్క ఎలా తియ్యాలో అన్న విషయాన్ని ఒక వీడియో ద్వారా ఓ నెటిజన్ చూపించాడు.

డెన్వర్‌కి చెందిన జేమ్స్ రెంబో… ఈ ట్రిక్ చేసి చూపించగా టిక్ టాక్ యూజర్ సారా రోజ్సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు.దీనితో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.

ఇంతకీఈ ఆ వీడియో లో ఉల్లి తొక్కను ఎంత తేలికగా తీశారో తెలుసా.ఓ ఉల్లిపాయను రెండు ముక్కలుగా చేసి… ఓ సగ భాగంపై చేచితో కొట్టాడు.

అంతే… సగం ఉల్లి రెండు ముక్కలై… పై తొక్క ఈజీగా వచ్చేసింది.ఈ వీడియో కాస్త టిక్ టాక్ యూజర్ షేర్ చేయడం తో అది కాస్త నెటిజన్లకు బాగా నచ్చింది.

భలే ఉంది… ఈజీ… అనుకుంటూ… అందరూ… అందరికీ షేర్ చేసుకుంటున్నారు.ముఖ్యంగా బ్యాచిలర్స్‌కి ఈ వీడియో బాగా నచ్చేస్తోంది.ఇంట్లో ఉంటూ ఉల్లిపాయల తొక్కలు తియ్యలేకపోతున్నాం అనుకునే వారు… ఇదే సరైన ట్రిక్ అంటున్నారు.ఎంతైనా లాక్ డౌన్ టైం లో అందరూ ఇళ్లకే పరిమితమై ఉండడం తో మగవారికి ఈ వీడియో చాలా హెల్ప్ ఫుల్ అవుతుంది అన్నమాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube