విజయ్ దేవరకొండ పేరు చెప్పి బోగస్ ఆడిషన్స్

సినిమా ఇండస్ట్రీలో సినిమా హీరోల పేర్లు చెప్పి కొత్త సినిమాకి నటీనటులు కావాలి అంటూ ప్రకటనలు ఇచ్చి, డబ్బులు తీసుకొని మోసాలకి పాల్పడుతూ ఉంటారు.పలానా సినిమాలో నిన్ను హీరోగా చేస్తాం అంటూ చెప్పి అవకాశాల కోసం వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు లాగేస్తూ ఉంటారు.

 Team Vijay Devarakonda Alerts On Fake Casting Call, Tollywood, Fake Auditions, V-TeluguStop.com

ఇలాంటి మోసాలు ఎప్పటి నుంచో ఉన్నాయి.ఇప్పుడు అలాంటి మోసాలకి విజయ్ దేవరకొండ పేరుని ఈ మధ్య భాగా వాడేస్తున్నారు.

యూత్ లో విజయ్ కి మంచి క్రేజ్ ఉండటంతో ఆ మధ్య కాలంలో విజయ్ దేవరకొండ పేరుతో పేస్ బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ మోసాలకి పాల్పడ్డాడు.అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇప్పుడు మరో కొత్త రకం మోసాన్ని విజయ్ దేవరకొండ టీం గుర్తించింది.

విజయ్ పేరును ఉపయోగించుకుని కొన్ని నిర్మాణ సంస్థలు తప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్నట్టు వెల్లడైంది.

ఈ మేరకు విజయ్ దేవరకొండ టీమ్ ఓ ప్రకటన చేసింది.విజయ్ దేవరకొండతో తాము సినిమా తీయబోతున్నామని, ఆ సినిమాకు ఆడిషన్స్ చేస్తున్నామని చెబుతూ కొన్ని నిర్మాణ సంస్థలు నటీనటులను సంప్రదిస్తున్నట్టు తెలిసిందని విజయ్ టీమ్ పేర్కొంది.

ఇలాంటి ఆడిషన్స్ ను ఎవరూ నమ్మవద్దని, ఏదైనా అధికారిక సమాచారం ఉంటే విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడిస్తారని, లేకపోతే ఆ సినిమా నిర్మాత నేరుగా అనౌన్స్ చేస్తారని వివరించింది.ఇలాంటి తప్పుడు ఆడిషన్స్ కు సంబంధించిన ప్రకటనలు ఎవరూ నమ్మవద్దని, ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోవాలని స్పష్టం చేసింది.

మరి తప్పుడు ఆడిషన్స్ నిర్వహిస్తున్న సదరు వ్యక్తులపై విజయ్ దేవరకొండ ఎలాంటి యాక్షన్ తీసుకుంటాడు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube