కరోనా భయం : వర్క్‌ ఫ్రమ్‌ హోంకే టెక్కీల మొగ్గు.. టీమ్ వ్యూయర్‌కు కాసుల పంట  

Team Viewer Sees Demand For Home-working Options For Techies - Telugu Coronavirus, Karona Effect, Options For Techies, Team Viewer, Work From Home, కరోనా

చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 (కరోనా వైరస్) బారినపడి మరణించిన వారి సంఖ్య ఇప్పటికే రెండు వేలు దాటింది.ఇంకా దాదాపు 80 వేల మంది ఈ సోకి ఆసుపత్రుల్లోని ఐసోలేటెట్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.

Team Viewer Sees Demand For Home-working Options Techies - Telugu Coronavirus Karona Effect Work From Home కరోనా

ఇలా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా ప్రభావం వాణిజ్యాన్ని కుదిపేస్తోంది.ఎలక్ట్రానిక్స్, ఎయిర్‌లెైన్స్, ఎగుమతి, దిగుమతులు, ఔషధాలు చివరికి ఆహార రంగం సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతున్నాయి.

వైరస్ భయంతో ఐటీ పరిశ్రమ సైతం తల్లడిల్లిపోతోంది.ఉద్యోగులు గడప దాటి భయటకు కాలు పెట్టడం లేదు.పలు కంపెనీలు సైతం కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.‘‘ వర్క్ ఫ్రమ్ హోమ్’’ కాన్సెప్ట్ ద్వారా ఉద్యోగులు పనిచేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.

దీంతో చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్‌కే మొగ్గు చూపడంతో కనెక్టివిటీ సంస్థ టీమ్ వ్యూయర్‌కు డిమాండ్‌ పెరుగుతోంది.దీని ద్వారా ఎప్పుడైనా.

ఎక్కడి నుంచైనా ఆఫీసుకు నేరుగా కనెక్ట్ కావొచ్చు.ఇది లాగిన్ అవ్వడానికి రిమోట్‌గా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది.

ఈ సౌకర్యమే ప్రస్తుతం టీమ్ వ్యూయర్‌కు కాసుల పంట పండిస్తోంది.

గత సెప్టెంబర్ నాటికి అంతంత మాత్రంగా ఉన్న ఈ కంపెనీ లాభాలు… 2020లో ప్రారంభమైన నాలుగో త్రైమాసికం నాటికి అనూహ్యంగా పుంజుకున్నట్లు జర్మన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఉచితంగానే కనెక్ట్‌విటీ సేవలను అందిస్తున్న ఈ సంస్థ వినియోగదారులను పేయింగ్ సబ్‌స్క్రైబర్స్‌గా మార్చేందుకు ప్రయత్నిస్తోంది.సురక్షితమైన రిమోట్ యాక్సెస్, సపోర్ట్, రిమోంట్ కంట్రోల్ ఇతర సదుపాయాల కారణంగా టెక్కీలు దీనిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

గణాంకాలను బట్టి ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల డివైస్‌లలో టీమ్ వ్యూయర్ ఇన్‌స్టాల్ చేయబడిందని అంచనా.ప్రతిరోజూ ఏ సమయంలోనైనా టీమ్ వ్యూయర్‌లో 45 మిలియన్ల మంది ఆన్‌లైన్‌లో ఉంటారు.ఇంతటి ప్రజాదరణ నేపథ్యంలో టీమ్ వ్యూయర్ ఫ్రాంక్‌ఫర్ట్‌లోని మిడ్ క్యాప్, టెక్ స్టాక్‌ ఇండెక్స్‌లో లిస్టయ్యింది.2020లో 430 నుంచి 440 మిలియన్ యూరోలు ( 471- 482 మిలియన్ డాలర్లు) ఆదాయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.ప్రైవేట్ ఈక్విటీ సంస్థ పెర్మిరా చేత నియంత్రించబడే టీమ్ వ్యూయర్ పెట్టుబడిదారులకు సుస్థిరతను అందిస్తోంది.దీని వినియోగం వల్ల పర్యావరణంపై దుష్పరిణామాలు తగ్గడంతో పాటు ప్రయాణం తదితర వ్యయాలు తగ్గుతాయి.

తాజా వార్తలు

Team Viewer Sees Demand For Home-working Options For Techies-karona Effect,options For Techies,team Viewer,work From Home,కరోనా Related....