అంతా కలిసి కౌశల్‌ను ఓడించాలని భావించి, వారే కౌశల్‌ గెలుపుకు బాట వేస్తున్నారు!

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 వచ్చే వారంతో ముగియబోతుంది.ఈ షో లో మొదటి నుండి కౌశల్‌ ఒంటరిగా పోరాటం చేస్తుండగా, ఇతరులు అంతా కలిసి ఆయన్ను టార్గెట్‌ చేస్తున్నారు.

 Team Members Making To Koushal To Win In The Big Boss-TeluguStop.com

ఒకరితో తాను రిలేషన్‌ షిప్‌ పెట్టుకుని, వారితోనే ఉంటూ, వారి కోసమే టాస్క్‌లో పాల్గొనేది లేదు అంటూ కౌశల్‌ మొదటి నుండి అంటూ వస్తున్నాడు.తాజాగా కూడా కౌశల్‌ అదే మాట మాట్లాడటంతో పాటు, ఇతర కుటుంబ సభ్యులతో వాగ్వివాదం దిగడంతో ఇంంటి సభ్యులంతా కూడా కౌశల్‌ను టార్గెట్‌ చేశారు.

ముఖ్యంగా నిన్నటి ఎపిసోడ్‌లో అంతా కూడా కౌశల్‌ను టార్గెట్‌ చేయడంతో ఆయన బలహీనపడి పోయి చివరకు కుక్కల మాదిరిగా నా వెంట పడుతున్నారు అంటూ ఆవేశంలో అనేశాడు.దాంతో అంతా కూడా ఆయన కుక్క అంటూ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రోల్‌ రైడా ఏకంగా ఏడ్చుకుంటూ, కౌశల్‌ కాళ్లు పట్టుకుని మరీ ఇకపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడవద్దంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.కౌశల్‌ తీరును ప్రేక్షకులకు బ్యాడ్‌ గా ప్రజెంట్‌ చేసేందుకు ఇంటి సభ్యులు మరియు బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్రయత్నాలు చేశారు.

కాని కౌశల్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గక పోగా ఆయన అభిమానులు మరింతగా పెరుగుతున్నాయి.

అందరు కలిసి ఒకరిని టార్గెట్‌ చేస్తే ఖచ్చితంగా ఆ ఒక్కరిపై సింపతీ పెరుగుతుంది.ఆ సింపతీ ఓట్లు ఇప్పుడు కౌశల్‌కు భారీ ఎత్తున పడుతున్నట్లుగా సమాచారం అందుతుంది.షోలో ఉన్న వారు కౌశల్‌ను బ్యాడ్‌ చేయాలని చూస్తే కౌశల్‌ ఆర్మీ మాత్రం పూర్తిగా కౌశల్‌కు ఈ విషయంలో మద్దతుగా నిలవడం జరిగింది.

దాంతో కౌశల్‌ ఈ రెండు వారాలు కామ్‌గా ఉండాలని, కాస్త ఓపిక పడితే టైటిల్‌ విజేత అవ్వొచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఈ రెండు వారాల్లో ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కౌశల్‌ను పదే పదే రెచ్చగొట్టడం వల్ల ఆయన టెంపర్‌ లాస్‌ అయ్యి మరేదైనా చేసేలా చేస్తారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube