ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా..!

ఆస్ట్రేలియా గడ్డపై ఆస్ట్రేలియా ను మట్టి కరిపించి ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ ను టీమిండియా 2 -1 తో కైవసం చేసుకుంది.అసాధారణమైన పోరాటంతో ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై అనితర సాధ్యమైన విజయన్ని టీమిండియా అందుకుంది.

బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో 38 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా ఓడిపోకుండా కాపాడుకుంటూ వచ్చిన రికార్డును టీమిండియా చెరిపేసింది.328 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా అవలీలగా ఆడుతూపాడుతూ చేధించింది.ఇందులో భాగంగా ఓపెనింగ్ బ్యాట్స్ మాన్ గా వచ్చిన రోహిత్ శర్మ తక్కువ పరుగులకే పరిమితం అవ్వగా శుభమన్ గిల్ 91 పరుగులు, చివరిలో రిషబ్ పంత్ తనదైన మార్కు చూపిస్తూ 89 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇకపోతే ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 300కు పైగా స్కోర్లు చేసి గెలవడం ఇది టీమిండియాకు కేవలం మూడో సారి మాత్రమే.నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ను 4 పరుగులతో ముగించిన తర్వాత.

నేడు ఉదయం స్కోర్ బోర్డ్ 18 పరుగులకు చేరుకోగానే రోహిత్ శర్మ కేవలం 7 పరుగులతో వెనుదిరిగాడు.ఇక రోహిత్ పెవిలియన్ కు చేరుకున్నాక అసలు కథ మొదలైంది.

గిల్ తో కలిసి పుజారా నెమ్మదిగా ఇన్నింగ్స్ ను చక్కదిద్దడం మొదలు పెట్టేసారు.వీళ్లిద్దరు రెండో వికెట్ కి ఏకంగా 114 పరుగులు భాగస్వామ్యాన్ని జోడించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.

Advertisement

లంచ్ తర్వాత గిల్ కేవలం సెంచరీకి 9 పరుగుల దూరంలో అవుటయ్యాడు.ఆ సమయానికి రహనే అవుట్ అవ్వడంతో 167 అడుగులకు టీమిండియా మూడు వికెట్లను కోల్పోయింది.

ఇక ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రిషబ్ పంత్ మరోసారి తనదైన స్టైలిష్ బ్యాటింగ్ తో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడ్డాడు.మూడో టెస్టులో 97 పరుగుల చేసి టెస్ట్ మ్యాచ్ డ్రా కావడానికి ఎంతగానో సహాయపడిన రిషబ్ పంత్.నాలుగో టెస్టు లోనూ తనదైన ఆట ఆడి టీమిండియా విజయంలో తన పాత్ర పోషించాడు.

చివరి రోజు భారత బ్యాట్స్మెన్స్ ను ఇబ్బంది పెట్టడానికి ఆస్ట్రేలియా బౌలర్స్ బెంబేలెత్తించే ప్రయత్నం చేసిన భారత బ్యాట్స్మెన్లు అనేకసార్లు శరీరంపైన దెబ్బలు తగిలిన చివరికి వారిని ఎదుర్కొన్నారు.చివరి సెషన్లో రిషబ్ పంత్ అటాకింగ్ బ్యాటింగ్ మొదలు కావడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది.

ఈ విజయంతో టీమిండియా ఆస్ట్రేలియాపై చారిత్రక విజయాన్ని అందుకుంది.

షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..
Advertisement

తాజా వార్తలు