ఏకలవ్య అవార్డుకు ఎంపికైన టీమిండియా వైస్ కెప్టెన్ కే.ఎల్. రాహుల్..!

టీమ్ ఇండియా టి20 వైస్ కెప్టెన్ గా నియమితులైన కర్ణాటక స్టార్ బ్యాట్స్మెన్ కే.ఎల్.

 Team India K L Rahul Has Elected For Ekalavya Award Kl Rahul, Ipl 2020, Elalavy-TeluguStop.com

రాహుల్ కు తాజాగా ఏకలవ్య అవార్డు లభించింది.ప్రతి సంవత్సరం కర్ణాటక ప్రభుత్వం క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ప్రధానం చేసే ఏకలవ్య అవార్డును ఈసారి కె.ఎల్.రాహుల్ దక్కించుకున్నాడు.గత కొద్ది కాలం నుండి అద్భుతమైన ఆటతీరుతో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది.ఈ విషయాన్ని కె.

ఎల్.రాహుల్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.ఇందులో భాగంగానే ఆయన కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పురస్కారం అందిస్తున్నందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

దీంతో పాటు తాను ఈ స్థాయికి చేరుకున్న అంటే అందుకు తన కోచ్ లు, తనతోపాటు ఆడే జట్టు సభ్యులు, అలాగే తన కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి అపారమైన సహకారం అందడం ఇందుకు కారణమని తెలియజేశాడు.

వీరందరూ లేకపోతే తాను ఈ స్థాయికి చేరే వాడిని కాదని చెప్పుకొచ్చాడు.భవిష్యత్తులో మరింతగా శ్రమించి కర్ణాటక రాష్ట్రానికి అలాగే భారతదేశానికి ప్రపంచం నలుమూలల పేరుప్రఖ్యాతలు తెస్తానని ట్విట్టర్ పూర్వకంగా కె.

ఎల్.రాహుల్ తెలియజేశారు.

ఇకపోతే ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో కె.ఎల్.రాహుల్ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.అయితే మొదట్లో వరుస ఓటముల నుంచి గట్టెక్కి మళ్లీ వరుస విజయాలతో ప్లే ఆఫ్ కి స్థానం కోసం బాగా పోరాడింది.

అయితే దురదృష్టవశాత్తు చివరికి గెలవాల్సిన మ్యాచ్లో చితికల పడింది.ఇక ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత టీమిండియా సభ్యులు ఆస్ట్రేలియా పర్యటనకు యూఏఈ దేశం నుంచి అటు నుంచి అటే ప్రయాణం కానున్నారు.

ఆస్ట్రేలియాలో జరిగే టి20, వన్డే సిరీస్ లకు గాను కె.ఎల్.రాహుల్ టీమిండియాకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube