ఈ ఒక్కటైనా గెలవలేకపోతే టీమిండియా పరువు గంగలో కలిసినట్లే..!

ప్రస్తుతం టీమిండియా దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే టెస్ట్ సిరీస్ పూర్తవగా ఇందులో భారత్ ఘోర పరాజయం పాలైంది.

 Team India Tour Of South Africa Last One Day Match Details, Team India, Winning,-TeluguStop.com

టెస్ట్ సిరీస్‌లో మాత్రమే కాదు వన్డే సిరీస్‌లో కూడా భారత జట్టు దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి పాలయింది.

ఇక ఈ వన్డే సిరీస్ కూడా ఓడిపోయినట్లే కానీ నామమాత్రపు మ్యాచ్ ఆడాల్సి ఉంది.కాబట్టి భారత్ ఈరోజు దక్షిణాఫ్రికాతో చివరి వన్డే ఆడుతోంది.

సరిగ్గా మధ్యాహ్నం రెండు గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

అయితే సౌతాఫ్రికా పర్యటనలో వరుస ఓటములతో అభిమానులను నిరాశపరిచింది టీం ఇండియా.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా ఓడిపోతే భారత క్రికెట్ జట్టు పరువు గంగలో కలుస్తుంది.ఘోర పరాభవాన్ని మోస్తూ భారత జట్టు ఇంటికి పయనం కావాల్సిన పరిస్థితి వస్తుంది.

అందుకే చివరి మ్యాచ్ నైనా గెలుపుతో ముగించాలని రాహుల్ సేన పూనుకుంది.అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ గెలవాలంటే మిడిలార్డర్ కంపల్సరిగా బలంగా ఉండాల్సిన అవసరం ఉంది.

మిడిలార్డర్ బలహీనంగా ఉండటం వల్లే భారత్ తొలి వన్డే మ్యాచ్ కోల్పోయింది.శ్రేయస్ అయ్యర్ ఈ ఆటలో బాగా ఆడితే విజయం అందుకోవడం సులభమవుతుంది.

Telugu Bumrah, Kl Rahul, Kohli, Day, Latest, Shreyas Ayar, Africa, India-Latest

కోహ్లీ ఈ చివరి గేమ్ లో మేటిగా ఆడితే విజయం సాధించవచ్చు.ఓపెనర్లు శిఖర్ ధావన్/రుతురాజ్ గైక్వాడ్‌, కేఎల్ రాహుల్ శుభారంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది.జస్‌ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్‌, దీపక్ చాహర్ మంచి ఆటతీరును కొనసాగించడం కూడా తప్పనిసరి.బౌలింగ్ లో పేస్, స్పిన్నర్లు మెరుగ్గా రాణిస్తే ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లను ఎక్కువ స్కోర్ కే కట్టడి చేయచ్చు.

మరి కేప్ టౌన్ వేదికగా జరిగే చివరి మ్యాచ్‌లో భారత్ తన పరువు దక్కించుకుంటుందా లేదా అనేది మరి కొద్ది గంటల్లో తేలుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube