టీమిండియా న్యూజిలాండ్ పర్యటన వాయిదా..?!

టీమిండియా వరుస మ్యాచులతో దూసుకుపోతోంది.ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటలో ఇండియాకు ఉన్న క్రేజ్ వేరు.

 Team India Tour Of New Zealand Postponed Team India, Newland , Team, Sports Upda-TeluguStop.com

తాజాగా టీమిండియాలో వరుస వివాదాలు నెలకొంటున్నాయని వార్తలు వస్తున్నాయి.అయితే వాటిని ఖండిస్తూ టీమిండియా దూకుడు ప్రదర్శిస్తోంది.

వరుస విజయాలతో, రికార్డులతో సత్తాను చాటుతోంది.ఇలాంటి సమయంలో ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది.

న్యూజిలాండ్‌ పర్యటనను టీమిండియా వాయిదా వేసుకుంది.న్యూజిలాండ్‌ దేశంలో వచ్చే సంవత్సరం ఇండియా జట్టు మూడు వన్డేలు ఆడాల్సి ఉంది.

అయితే 2023వ సంవత్సరంలో వరల్డ్‌ కప్‌ సూపర్‌ లీగ్‌ లో భాగంగా విరాట్‌ కోహ్లి బృందం కివీస్‌ తో మూడు వన్డేలలో పాల్గొనాల్సి ఉంది.తాజగా ఆ సీరిస్ వాయిదా పడింది.

అయితే ఆస్ట్రేలియా వేదికగా జరగనున్నటువంటి టి20 ప్రపంచకప్‌ 2022వ ఏడాది ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్‌ లో వన్డే సిరీస్‌ ఆడేలా షెడ్యూల్‌ చేయనున్నట్లు కివీస్‌ క్రికెట్‌ బోర్డు అధికారి ఒకరు ప్రకటించారు.

వాస్తవానికి న్యూజిలాండ్‌ జట్టు వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ నెల వరకు బిజీగా గడిపే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్‌ తో పాటుగా టి20 సిరీస్‌ ముగిసిపోయిన తర్వాత ఆటగాళ్లు ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌ ఆడేందుకు యూఏఈకి వెళ్లిపోవాలి.అది అయిపోయిన తర్వాత అక్కడే జరగనున్న టి20 ప్రపంచకప్‌ 2021లో పాల్గొనాల్సి ఉంది.

Telugu Newland, Cup, India-Latest News - Telugu

ప్రపంచకప్‌ అనంతరం కివీస్‌ భారత్‌ లో పర్యటించి రెండు <టెస్టులు, మూడు టీ20 ఆడనున్నట్టు తెలుస్తోంది.ఆ విధంగా చూసుకుంటే న్యూజిలాండ్‌ జట్టు డిసెంబర్‌ నెలలో మళ్లీ స్వదేశానికి వస్తుంది.న్యూజిలాండ్‌ సర్కార్ కొత్తగా విడుదల చేసిన కరోనా మార్గదర్శకాల ప్రకారం 14 రోజులు క్వారంటైన్‌ లో ఉండాలి.ఇకపోతే మార్చి 4వ తేది నుంచి ఏప్రిల్‌ 3వ తేది వరకు మహిళల వరల్డ్‌కప్‌ కు న్యూజిలాండ్‌ ఆతిథ్యమివ్వనున్న విషయం తెలిసిందే.

మొత్తానికి న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా తన సత్తాను చాటనుంది.అతి త్వరలో మరిన్ని వివరాలను బీసీసీఐ వెల్లడించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube