దేవుడా తమపై దయ చూపించమంటున్న టీమిండియా స్పిన్నర్..!

ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ రెండోసారి ఏవిధంగా విజృంభిస్తోందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం.రోజుకి మూడు వేల నుంచి నాలుగు వేల మధ్యలో ప్రజలు మరణిస్తున్న సంగతి మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం.

 Team India Spinner Ravichandran Ashwin Shares Emotional Tweet Over Corona Virus-TeluguStop.com

ముఖ్యంగా ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రజలకు భయాందోళనలు కలిగించేలా ఉన్నాయి.ఇక అసలు విషయంలోకి వెళితే.

దేశం కరోనా సంక్షోభంలో చిక్కుకున్నప్పటి నుండి టీమిండియా బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ సామాజిక మాధ్యమాలలో చురుగ్గా ఉన్నాడు.

 Team India Spinner Ravichandran Ashwin Shares Emotional Tweet Over Corona Virus-దేవుడా తమపై దయ చూపించమంటున్న టీమిండియా స్పిన్నర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇందులో భాగంగా రవిచంద్రన్ అశ్విన్ ప్రతి ఒక్కరిని మాస్కులు ధరించి సురక్షితంగా ఉండాలని ప్రజలకు సూచనలు అందిస్తున్నాడు.

తాను కేవలం సూచనలు ఇచ్చేంత వరకు మాత్రమే కాకుండా ఎవరికైతే మాస్కు కొనుగోలు చేయలేని స్తోమత లేనివారికి తాను N 95 మాస్క్ లు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేస్తామని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.అయితే తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓ బావోద్వేగకతపూరితమైన సందేశాన్ని ప్రజలతో పంచుకున్నాడు.

ఈ సంక్షోభం అంతా ముగిసిన తర్వాత నన్ను లేపండి.ఇంకా ఎంత మంది ప్రజలు చనిపోవాలి.? ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి.

దయచేసి మాస్కులు ధరించడంతో పాటు సామాజిక దూరం ఖచ్చితంగా పాటించక పోవడం అతి త్వరలో మన దేశంలో కూడా నేరంగా మారవచ్చు అని తెలుపుతూనే.దేవుడా తమపై కాస్త దయ చూపించు అంటూ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సందేశాన్ని తెలిపాడు.ఇకపోతే భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జూన్ 18 నుంచి 22 మధ్య జరగబోయే మ్యాచ్ కి అలాగే ఆ మ్యాచ్ తర్వాత ఇంగ్లాండ్ తో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్ ల నేపథ్యంలో భాగంగా బిసిసిఐ ఇదివరకే తుది జట్టును ప్రకటించింది.

ఇందులో రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని సంపాదించాడు.

#Crime #England #New Zealand #Mask #Emotional Tweet

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు