ప్రపంచ కప్ కు సన్నద్ధమైన టీమిండియా...ఇంగ్లాండ్ వెళ్ళింది  

Team India Ready To Play World Cup-england,team India,virat Kohili,world Cup,టీమిండియా,ప్రపంచ కప్

ఐసీసీ వరల్డ్‌కప్‌ కు టీమిండియా సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టు ముంబై ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఇంగ్లాండ్‌ బయలుదేరి వెళ్లింది. ఈ నెల 30 న ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వేదికగా మెగా టోర్ని ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ కి ముందు మే 25 న న్యూజిలాండ్ తో తోలి వార్మప్ మ్యాచ్ లో భారత్ తలపడనుంది. .

ప్రపంచ కప్ కు సన్నద్ధమైన టీమిండియా...ఇంగ్లాండ్ వెళ్ళింది -Team India Ready To Play World Cup

అలానే మే 28 న బాంగ్లాదేశ్ తో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్ బయలు దేరి వెళ్ళింది. విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్‌ జట్టు జూన్‌ 5న సౌతంప్టన్‌ వేదికగా సౌతాఫ్రికాతో పోరుతో టోర్నీని మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో 15 మంది సభ్యుల బృందంతో పాటు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, జట్టు సహాయ సిబ్బంది ఇంగ్లాండ్‌ వెళ్లారు.

ఈ సందర్భంగా ఆటగాళ్లందరూ ప్రత్యేక డ్రెస్‌కోడ్‌లో మెరిసిపోయారు.

విమానం ఎక్కేందుకు ముందు వీరంతా కూడా సరదా గా ఆన్ లైన్ గేమ్స్ ఆడుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.