ఒలింపిక్స్ వెళ్లే అథ్లెట్స్ ను ఉత్సాహపరిచిన టీమిండియా ప్లేయర్స్..!

మన భారతీయులందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే టోక్యో ఒలింపిక్స్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి.ఈ టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి మనం భారత అథ్లెట్లు మరో 6 రోజుల్లో టోక్యోకు బయలుదేరనున్నారు.

 Team India Players Cheer For Olympic Athletes, Team India, Cricketers, Supportin-TeluguStop.com

ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అథ్లెట్లకు అందరు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు.మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ” ఛీర్ ఇండియా ” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

మోదీ చేసిన పోస్ట్ వలన భారత అథ్లెట్లలో ఉత్సహం మరింత రెట్టింపు అయిందనే చెప్పాలి.అంతేకాకుండా ప్రధాని మోడీ ఈ నెల 13 న అథ్లెట్లతో వర్చువల్‌ గా కూడా మాట్లాడనున్నట్లు తెలుస్తుంది.

నిజానికి పోయిన సంవత్సరమే ఈ టోక్యో ఒలింపిక్స్ జరగాలిసింది.కానీ కరోనా వైరస్ కారణంగా వాయిదా పడి, ఈ ఏడాది టోక్యో వేదికగా జులై 23 నుంచి మొదలుకానున్నాయి.

అలాగే ఆగస్టు 8 న ఈ క్రీడలు ముగుస్తాయి.మన భారత దేశం నుంచి ఈ ఏడాది ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు దాదాపు 120 మంది అథ్లెట్లు సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది.

అయితే అందరు ఒకేసారి కాకుండా మొదటి విడతగా జులై 17న కొంతమంది ఆటగాళ్లు టోక్యో వెళ్ళబోతున్నారు.మిగతావాళ్ళు తరువాత వెళ్లనున్నట్లు సమాచారం.

Telugu Athletes, Bcci, Cricketers, Indian Athletes, July, India, Tokyo-Latest Ne

నరేంద్ర మోడీతో సహా బీసీసీఐ తరుపున కూడా మన టీమిండియా ఆటగాళ్లు అథ్లెట్లకు అభినందనలు తెలుపుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రహానే, మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ ఇలా చాలామంది క్రికెటర్లు అథ్లెట్లకు ఛీర్స్ తెలియజేశారు.అలాగే క్రీడాకారుల శిక్షణ కోసం బీసీసీఐ రూ.10 కోట్లను ఐఓఏకు అందించిన విషయం తెలిసిందే.అయితే ఈ పోటీల ప్రారంభోత్సవంలో లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత బాక్సర్ ఎంసీ మేరీ కోమ్, హాకీ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ విచ్చేయనున్నారు.అలాగే పోటీలకు ముగింపు వేడుకల్లో టాప్ రెజ్లర్ బజరంగ్ పూనియాకు ఆహ్వానం అందినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube