ఓ ఇంటివాడైన టీమిండియా ఆల్ రౌండర్..!

టీమిండియా క్రికెట్ లో సభ్యుడైన ఆల్ రౌండర్ విజయ్ శంకర్ తాజాగా గురువారం నాడు ఓ ఇంటి వాడయ్యాడు.కుటుంబ పెద్దలు సమక్షంలో కరోనా నిబంధనలు పాటిస్తూ సన్నిహిత బంధువులు మిత్రుల మధ్య కేవలం కొద్ది మంది మాత్రమే పెళ్లికి హాజరైనట్లు సమాచారం.

 Team India All Rounder Vijay Shankar Married To Vaishali, Vijay Shankar, Team In-TeluguStop.com

విజయ్ శంకర్, వైశాలి విశ్వేశ్వరన్ ను  నేడు వివాహమాడాడు.గత సంవత్సరం ఆగస్టు నెలలో విజయ శంకర్ వైశాలి ల నిశ్చితార్థం జరిగింది.

ఇందుకు సంబంధించి కూడా విజయ్ శంకర్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలను షేర్ చేశాడు.ఆ ఫోటోలకు ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిపే విధంగా ఉంగరం ఏమోజీ ని జత చేసి ఫోటోలను షేర్ చేశాడు.

ఇక విజయ శంకర్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ జట్టు తరఫున మ్యాచులు ఆడుతున్న కారణంగా టీమ్ సభ్యుడైన విజయ శంకర్ కు విషెస్ తెలుపుతూ సన్ రైజర్స్ టీం యాజమాన్యం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది.ఇందులో భాగంగానే హ్యాపీ మ్యారేజ్ లైఫ్ విజయ్ అంటూ సన్ రైజర్స్ ఆర్మీ అనే ట్యాగ్ ఇస్తూ శుభాకాంక్షలు తెలిపింది.

Telugu Sunrisers, India, Vaishali, Vijay Shankar-Latest News - Telugu

ఇక టీమిండియా ఆటగాడు విజయ్ శంకర్ కు టీమిండియా ఆటగాళ్లు చాహల్, కేఎల్ రాహుల్ తో పాటు మరికొందరు టీం ఇండియా ఆటగాళ్లు పలువురు, ప్రముఖులు అతడికి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక టీమిండియా తన తర్వాతి సిరీస్ లో చెన్నై నగరంలో ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube