ఇంస్టాగ్రామ్ లో ఆ నలుగురిని ఫాలో అవుతున్న టీమిండియా మాజీ కెప్టెన్....

మన భారతదేశానికి 2011లో రెండవసారి ప్రపంచకప్ ను అందించిన టీమిండియా కెప్టెన్ ఎంఎస్ ధోని.

2007లో మొట్టమొదటి టి20 ప్రపంచ కప్ ను అప్పటి కెప్టెన్ గా ఉన్నా ధోని మన దేశానికి అందించాడు.

ధోని 1981 జులై 7వ తేదీన జన్మించాడు.ఎమ్మెస్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు టీం ఇండియాకు చాలా విజయాలను అందించాడు.ఎంఎస్ ధోని కి మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.2004లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని దాదాపు 16 సంవత్సరాల కెరీర్‌లో టీమిండియా కు ఎన్నో క్రికెట్ మ్యాచ్ లలో ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.ధోనిని అభిమానులు మిస్టర్ కూల్, ఝూర్ఖండ్ డైనమేట్ ఇలా రకరకాల పేర్లతో ధోనిని పిలుచుకుంటారు.

ధోని మైదానంలో కనిపిస్తే చాలు జనాల అరుపులు మామూలుగా ఉండవు.కెప్టెన్‎గా, బ్యాటర్‎, వికెట్ కీపర్‎గా టీమిండియా కు అతడు అందించిన సేవలు వెలకట్టలేనివి.2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ మహేంద్రడు ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు.అయితే చాలా అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే ధోనికి ఇన్ స్టాలో 39.5 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు.

అయితే ధోని మాత్రం కేవలం నలుగురినీ మాత్రమే ఫాలో అవుతున్నారు.ఆ నలుగురు ఎవరంటే తన భార్య సాక్షి, కూతురు జీవా, లెజండరీ యాక్టర్ అమితాబచ్చన్‌తో పాటు తన కూరగాయల పామ్ ఈజా ఫామ్స్ ఖాతాను ఫాలో అవుతున్నాడు.ప్రస్తుతం ధోని క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని సహజసిద్ధంగా వ్యవసాయం చేస్తున్నాడు.

Advertisement

కడక్ నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు.గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఆర్మీలో కూడా మన దేశానికి సేవలందిస్తున్నాడు.

వచ్చే ఐపీఎల్‌లో ధోని చెన్నై తరఫున బరిలోకి దిగుతాడని ఆ టీమ్ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు