మన టీమిండియా ఆటగాళ్ల సతీమణులు అసలు ఏం చేస్తుంటారంటే..?!

భారతదేశంలో క్రికెట్ అనేది కేవలం ఆట మాత్రమే కాదు.క్రికెట్ అంటే ఓ మతం.

 Team India Crickters Wifes Proffesions Ms Dhoni-TeluguStop.com

ముఖ్యంగా మనదేశంలో క్రికెట్ ను ఎంతగా అభిమానిస్తారో.క్రికెటర్లను అంతకుమించి ఆరాధిస్తారు.

వారి అభిమాన ఆటగాడు గ్రౌండ్ లో రెచ్చిపోతుంటే సగటు అభిమాని ఉత్సాహం మామూలుగా ఉండదంటే నమ్మండి.అయితే వారి అభిమాన క్రికెటర్ గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్క అభిమాని ఆసక్తి చూపిస్తుంటారు.

 Team India Crickters Wifes Proffesions Ms Dhoni-మన టీమిండియా ఆటగాళ్ల సతీమణులు అసలు ఏం చేస్తుంటారంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే అలాంటి వారి కోసం మన టీమిండియా క్రికెటర్ ల భార్యలు ఏం చేస్తున్నారో ఓసారి తెలుసుకుందాం.

మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని.

.టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ధోని భార్య సాక్షి.ఈవిడ హోటల్ మేనేజ్మెంట్ విద్యలో పట్టభద్రురాలు.మహేంద్ర సింగ్ ధోనీ ని పెళ్లి చేసుకోక ముందు కలకత్తా నగరంలో ఓ హోటల్లో ట్రైనిగా పనిచేసింది.ప్రస్తుతం ధోని యోగక్షేమాలు చూస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు.

ఇక ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.బాలీవుడ్ పరిశ్రమలో టాప్ స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అనుష్క శర్మ.

ప్రస్తుతం వీర సినిమాల్లో కొనసాగుతూనే.మరోవైపు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా పనిచేస్తుంది.

Telugu Bhumra, Ms.dhoni, Proffesions, Team India Crickters, Viral Kohili, Wifes-Latest News - Telugu

ఇక టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక. ఈవిడ స్పోర్ట్స్ మేనేజర్. స్పోర్ట్స్ మేనేజర్ అంటే ఆటగాళ్లకు సూచనలు ఇవ్వడం, అలాగే స్పోర్ట్స్ ఈవెంట్స్, మ్యాచ్ లు నిర్వహించడం లాంటి పనులు చేస్తారు.ఇక ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సౌరవ్ గంగూలీ భార్య డోనా గంగూలీ.

ఈవిడ ఒడిస్సీ నృత్యంలో ప్రావీణ్యం పొందింది.ఈవిడ మంజరీ అనే డాన్స్ ఇన్స్టిట్యూట్ ను నడుపుతున్నారు.

ఇక భారతదేశ క్రికెట్ ఆటగాళ్లలో దిగ్గజ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సతీమణి పేరు అంజలి.ఈవిడ శిశు వైద్యురాలు.

అయితే టెండూల్కర్ ను వివాహం చేసుకున్న తర్వాత ఆవిడ తన వైద్యురాలు కెరియర్ కి పులిస్టాప్ పెట్టారు.

#Viral Kohili #Bhumra #Proffesions #TeamIndia #MS.Dhoni

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు