రహానెకి అండగా నిలిచిన విరాట్ కోహ్లీ.. వారికి చురకలు!

Team India Cricketer Virat Kohli Supports Ajinkya Rahane Performance In New Zealand Test

ఒకప్పుడు అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా విజయాలకు కారణమైన అజింక్య రహానె ఇప్పుడు పేలవమైన ఆటతో నిరాశ పరుస్తున్నాడు.న్యూజిలాండ్ టీంతో ఇటీవల జరిగిన తొలి టెస్టులో రహానె కేవలం 39 పరుగులు మాత్రమే చేశాడు.

 Team India Cricketer Virat Kohli Supports Ajinkya Rahane Performance In New Zealand Test-TeluguStop.com

టెస్ట్ మ్యాచ్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించిన రహానె ఆ రేంజ్ లో విఫలం కావడం విమర్శలకు తావిచ్చింది.రెండో టెస్టులో కోహ్లీ టీమ్ లోకి రావడం.

శ్రేయస్ అయ్యర్  అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్లడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రహానెని పక్కనపెట్టేసింది టీమిండియా.

 Team India Cricketer Virat Kohli Supports Ajinkya Rahane Performance In New Zealand Test-రహానెకి అండగా నిలిచిన విరాట్ కోహ్లీ.. వారికి చురకలు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ రహానెకి మద్దతుగా వ్యాఖ్యలు చేశారు.విజయానంతరం కోహ్లీ మాట్లాడుతూ.“రహానె ఫామ్ గురించి నేను ఏం మాట్లాడదలుచుకోలేదు.అతన్ని జడ్జ్ చేయడం సరైనది కాదు.నేనే కాదు ఎవరూ కూడా చేయలేరు.సరిగ్గా  ఆడకపోవడానికి ఏ అడ్డంకులు ఎదురవుతున్నాయో వాటిని అధిగమించే అంశంపై దృష్టి సారిస్తే సరిపోతుంది.అది రహానె లేదా ఏ ఆటగాడైనా కావచ్చు.

కీలక మ్యాచులలో అద్భుత ప్రదర్శనతో జట్టును విజయ తీరాల వైపు నడిపించగల  ఆటగాళ్లకు కష్టకాలంలో మద్దతుగా నిలబడాలి” అని చెప్పుకొచ్చారు.

కోహ్లీ చేసిన ఈ వ్యాఖ్యలకు ఫ్యాన్స్ అందరూ ఫిదా అవుతున్నారు.

Telugu Latest, Zealand, Permance, Rehane, Ajinkya Rahane, Indiacricketer, Virat Kohli-Latest News - Telugu

కీలక ఆటగాళ్ళందరూ విఫలమైనప్పుడు ఎన్నోసార్లు రహానె ఒంటి చేత్తో టీమ్ ఇండియాని గట్టెక్కించిన సందర్భాలున్నాయి.అవన్నీ మర్చిపోయి ఫామ్ లో లేనప్పుడు విమర్శలు చేయడం సరికాదని కోహ్లీ చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.అయితే రహానెపై దారుణమైన విమర్శలు వస్తూనే ఉన్నాయి.విమర్శకులకు కూడా కోహ్లీ చురకలంటించారు.బయట వ్యక్తులు, విమర్శకులు ఆటగాళ్లను జడ్జ్ చేస్తున్నా సరే వారి గురించి మేం మాటలు పట్టించుకోము.

Telugu Latest, Zealand, Permance, Rehane, Ajinkya Rahane, Indiacricketer, Virat Kohli-Latest News - Telugu

మా మద్దతు ప్రతీ ఆటగాడికి ఒకేలా ఉంటుంది.బయట పరిస్థితులు ఆధారంగా ఒక వ్యక్తిని జట్టులో ఉంచుకోవాలా లేదా అనేది మేం అసలు నిర్ణయించం” అని చెబుతూ కోహ్లీ అనవసరంగా నోరుపారేసుకున్న వారికి సున్నితంగా చురకలంటించారు.దాదాపు 80 టెస్టు మ్యాచుల్లో ఆడిన రహానె 12 సెంచరీలు 24 అర్థ సెంచరీలు సాధించాడు.

వన్డేల్లో కూడా 111 అత్యధిక స్కోరు తో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.ఐపీఎల్లో ఏకంగా రెండు సెంచరీలు సాధించి తన సత్తా ఏంటో చాటాడు.

#Permance #IndiaCricketer #Rehane #Virat Kohli #Zealand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube