అల్లు అర్జున్ వీడియోపై కామెంట్స్ చేసిన టీమిండియా క్రికెటర్..!

కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలో ఉన్న మిగతా చిత్ర పరిశ్రమలలో కూడా తనకంటూ పేరును సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ హీరో అల్లు అర్జున్.ఇదివరకే తాజాగా స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారిన అల్లు అర్జున్ కు కేవలం టాలీవుడ్ పరిశ్రమ మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా పెద్దఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది.

 Team India Cricketer Surya Kumar Yadav Responds To Allu Arjun Video Of Corona Negative-TeluguStop.com

ముఖ్యంగా గత సంవత్సరం విడుదలైన ‘అలా వైకుంఠపురంలో‘ సినిమాలో వచ్చిన ‘బుట్ట బొమ్మ’ , ‘ రాములో రాముల’ పాటలకు ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ కి కాస్త క్రేజ్ వచ్చిందని చెప్పవచ్చు.ఇకపోతే కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ కరోనా వైరస్ బారిన పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే.

తాజాగా అల్లు అర్జున్ కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు బుధవారం నాడు ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేస్తూ తెలిపిన సంగతి తెలిసిందే.

 Team India Cricketer Surya Kumar Yadav Responds To Allu Arjun Video Of Corona Negative-అల్లు అర్జున్ వీడియోపై కామెంట్స్ చేసిన టీమిండియా క్రికెటర్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ వీడియోలో అల్లు అర్జున్ తన హోమ్ క్వారంటైన్ సమయాన్ని పూర్తిగా గడిపి కరోనా వైరస్ నెగటివ్ వచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే తన కొడుకు, కూతురు లతో ఆలింగనం చేసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియోకి తాజాగా టీమిండియా క్రికెటర్ స్పందించారు.టీమిండియా యువ క్రికెటర్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఈ వీడియో కి ‘ బ్యూటిఫుల్ ‘ అనే కామెంట్ జత చేశాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో, అలాగే అల్లు అర్జున్ కరోనా వైరస్ బారిన పడటంతో షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది.ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా రష్మిక మందన నటిస్తోంది.అయితే తాజాగా అందిన సమాచారం మేరకు బాహుబలి చిత్రం లాగే పుష్ప సినిమా కూడా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు నెలలో పుష్ప సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

#TeamIndia #Responds #Comments #Corona Negative #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు