ఐపీఎల్ 2021 విజేత ఎవరన్న దానిపై జోస్యం చెప్పిన టీమిండియా కోచ్..!

మాజీ టీమిండియా కోచ్ గా వ్యవహరించిన రవిశాస్త్రిగురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకంట ఆయన క్రికేటర్ గా, టీమిండియా కోచ్ గా రాణించారు.

 Team India Coach Predicts Who Will Be The Winner Of Ipl 2021 ..! Indian Team Cao-TeluguStop.com

రవిశాస్త్రిపై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్, మీమ్స్ వస్తుండటం తెలిసిందే.అందుకు తగ్గట్లుగా ఆయన కూడా నెట్టింట ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు.

తాజాగా ఆయన ఓ ట్వీట్ చేశారు.ప్రస్తుతం అది నెట్టింట హల్ చల్ చేస్తోంది.

​బుధవారం ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన హోరాహోరీలో చివరకు కింగ్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీనే నెగ్గింది.ఒక్క పరుగుతో గెలిచిన ఆ జట్టు సంబరాలు చేసుకుంది.

చివరి వరకు పంత్ క్రీజులో ఉన్నా ఆఖరి ఓవర్లో రెండు ఫోర్లు దంచినా పంత్ జట్టు ఒక్క పరుగు దూరంలో ఆగిపోయి నిరాశగా పెవిలియన్ బాట పట్టింది.అయితే, ఈసారి ఐపీఎల్ లో కొత్త విజేత అవతరిస్తారని టీమిండియా కోచ్ రవిశాస్త్రి జోస్యం చెప్పాడు.

ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను ప్రస్తావిస్తూ అతడు ఈ కామెంట్ చేశాడు.

మ్యాచ్ కు సంబంధించి విరాట్, పంత్ కలిసి ఉన్న ఫొటోనూ ట్వీట్ చేశాడు.

ఈ ఐపీఎల్ లో కొత్త విజేత అవతరించేందుకు విత్తనాలు నాటుకున్నాయి.నిన్న రాత్రి హోరాహోరీ జరిగింది అంటూ అతడు ట్వీట్ చేశాడు.

ఇప్పటికే ఐదు టైటిల్స్ సాధించి రోహిత్ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది.మరో టైటిల్ ను పట్టేందుకు రెడీ అవుతోంది.

మరి, ఈ సీజన్ లోనూ మరో టైటిల్ వేటాడి ముంబై హ్యాట్రిక్ కొడుతుందా? లేదంటే రవిశాస్త్రి చెప్పినట్టు కొత్త విజేత పుట్టుకొస్తుందా? వేచి చూడాల్సిందే.భూమిపై అతిపెద్ద డొమెస్టిక్ క్రికెట్ లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ అవతరించింది.

ఏప్రిల్ 9వ తేదీనుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నమెంట్‌లో ప్రపంచపు అత్యుత్తమైన క్రికెటర్లంతా ఒకే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తారు.మొత్తం 8 జట్లు గత 13 సీజన్లలో టైటిల్ కోసం గట్టిపోటీ ఇచ్చాయి.

అయితే ఈ సారి ఐపీఎల్ లో ఎవరు గెలుస్తారో అనేది వేచిచూడాల్సిందే.దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube