ఆ వ్యక్తి స్పెషల్ అంటూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన కోహ్లీ..

భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు.వీలు చిక్కినప్పుడల్లా తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు పెడుతుంటారు.

 Team India Captain Virat Kohli Emotional Post On Super Dancer Sanchit Details-TeluguStop.com

అయితే తాజాగా విరాట్ కోహ్లీ షేర్ చేసిన ఒక ఇన్ స్టాగ్రామ్ స్టోరీ అందర్నీ ఆకట్టుకుంటోంది.విరాట్ కోహ్లీ సోనీ టీవీలో ప్రసారం అవుతున్న సూపర్ డాన్సర్ ప్రోగ్రామ్ చూస్తుంటారు.

ఈ డాన్స్ ప్రోగ్రామ్ లో కంటెస్టెంట్లు కనబరిచే ప్రతిభకు అతను మంత్రముగ్దులవుతుంటారు.ముఖ్యంగా ఒక కంటెంట్ పర్ఫామెన్స్ అంటే కోహ్లీకి చాలా ఇష్టం.

 Team India Captain Virat Kohli Emotional Post On Super Dancer Sanchit Details-ఆ వ్యక్తి స్పెషల్ అంటూ భావోద్వేగమైన పోస్ట్ పెట్టిన కోహ్లీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతని పేరు సంచిత్ కాగా.అతడి వయసు 10 సంవత్సరాలే.కోహ్లీ తాజాగా సంచిత్ గురించి ఒక భావోద్వేగమైన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు.

“నేను నా జీవితంలో ఇప్పటివరకు ఫలానా వ్యక్తి టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి, అబ్బురపడిన సందర్భాలు చాలా అరుదు.ఇప్పటి వరకు టాలెంటుతో నన్ను ఎమోషనల్ కు గురి చేసిన ఒకే ఒక వ్యక్తి అరిజిత్ సింగ్.ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పిల్లాడు తన టాలెంట్ తో నన్ను అబ్బురపరిచాడు.

ఈ పిల్లోడు డాన్స్ చేస్తున్న వీడియోలు చూసి నాకు వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.ఒక వ్యక్తి ప్రతిభను చూసి నాకు ఇప్పటి వరకు ఇలా ఎప్పుడూ జరగలేదు.అరిజిత్ సింగ్ తర్వాత మళ్లీ ఈ అబ్బాయి వల్ల నేను భావోద్వేగానికి గురయ్యాను.అతని నేచురల్ టాలెంట్, అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి.

Telugu Arijith Singh, Emotional Post, Instgram, Kohli Emotional Post, Latest, Latest News, Sanchit, Social Media, Super Dancer Program, Viral, Virat Kohli-Latest News - Telugu

దేవుడు ఈ అబ్బాయిని ఆశీర్వదించాలి, కాపాడాలి అని కోరుకుంటున్నాను.నువ్వు (సంచిత్) నిజంగా చాలా ప్రత్యేకమైన వ్యక్తివి.హాట్సాఫ్” అని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు.

విరాట్ కోహ్లీ ట్విట్టర్లో కూడా సంచిత్ పై ప్రశంసల జల్లు కురిపించారు.దీనిపై సంచిత్ కూడా స్పందించాడు.“బాధలో ఉన్నప్పుడు మీరు నా గురించి చెప్పిన మాటలను గుర్తు చేసుకొని మళ్లీ నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటాను.మీ మాటలతో నన్ను మరింత దృఢంగా చేసినందుకు మీకు కృతజ్ఞతలు” అని సంచిత్ రిప్లై ఇచ్చాడు.దీంతో నెటిజన్లు విరాట్ కోహ్లీ ప్రశంసించిన తీరును మెచ్చుకుంటున్నారు.

#Program #Kohli #Arijith Singh #Virat Kohli #Instgram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube