విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంటకు పాప పుట్టింది..!!

భారత్ టీం క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు.కోహ్లీ భార్య బాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శర్మ సోమవారం జనవరి 11 వ తారీకున ఆడ బిడ్డకు జన్మనివ్వడం జరిగింది.

 Virat Kohli And Anushka Sharma Blessed With Baby Girl,virat Kohli,anushka Sharma-TeluguStop.com

ఈ విషయాన్ని కోహ్లీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో భారత్ క్రికెట్ ప్రేమికుల తో పాటు విరాట్ కోహ్లీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.ఈ క్రమంలో మాకు కూతురు పుట్టిన్నందుకు.

మీరు చెబుతున్న విషెస్ కి చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అంటూ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో తెలియజేశాడు.అదేవిధంగా అనుష్క, పాప ఇద్దరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నాడు.

అంతేకాకుండా మా జీవితంలో కొత్త చాప్టర్ మొదలైందని.మా కుటుంబం ప్రైవసీని మీరంతా గౌరవిస్తారని ఆశిస్తున్నట్లు తెలియజేస్తూ కోహ్లీ సోషల్ మీడియాలో లెటర్ పోస్ట్ చేశాడు.కోహ్లీ చేసిన ఈ పోస్ట్ కి దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో లైకులు సాధించడంతోపాటు వైరల్ అవుతుంది.విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది.

ప్రముఖ కంపెనీ యాడ్ షూటింగ్ సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడటం తో ప్రేమలో పడటం తో తర్వాత పెళ్లి చేసుకోవడం తాజాగా ఈ జంట కి పాప పుట్టడంతో సెలబ్రిటీలు కూడా విషెస్ తెలియజేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube