అమ్మానాన్న కాబోతున్న 'విరుష్క'

టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరియు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మలు దాదాపు మూడు సంవత్సరాల క్రితం ఒక్కటి అయిన విషయం తెల్సిందే.వీరి జంట చూడముచ్చటగా ఉంటుందని ఇతరులకు వీరు ఆదర్శంగా ఉంటారని అంటారు.

 Anushka And Virat Announce Pregnancy, Team India Captain, Virat Kohili, Anushkha-TeluguStop.com

సెలబ్రెటీ జంట అయినా కూడా వారి మద్య ఉండే సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎంతో అందమైన జంటగా పేరు దక్కించుకున్న వీరు ఇప్పుడు తల్లిదండ్రులు కాబోతున్నారు.

ఈ విషయాన్ని వారు స్వయంగా మీడియాకు తెలియజేశారు.సోషల్‌ మీడియాలో ఈ ఫొటోను షేర్‌ చేయడంతో అంతా క్లారిటీ వచ్చేసింది.జనవరిలో అనుష్క బాబు లేదా పాపకు జన్మను ఇవ్వబోతుంది.ఈ ఆనందకర విషయాన్ని పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉందని సన్నిహితుల వద్ద విరుష్క దంపతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంలో అభిమానులు కూడా చాలా ఖుషీగా ఉన్నారు.కోహ్లీకి అందమైన అమ్మాయి పుట్టాలంటూ అభిమానులు కోరుకుంటున్నారు.

ఇద్దరి జంట అందంగా ఉంటుందని పుట్టబోతున్న అమ్మాయి కూడా చాలా అద్బుతంగా ఉంటుందని అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube