వరుణ్ తేజ్ కు బర్త్ డే విశేష్ చెప్పిన F3 టీమ్.. కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ ఇరగదీస్తున్నాడు!

టాలీవుడ్ హీరోలు విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న సినిమా ఎఫ్ 3.ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.

దిల్ రాజు సమర్పణలో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్ ఈ సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.ఇది 2019 సంక్రాంతి సీజన్ లో సూపర్ హిట్ అయినా F2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది.

F2 సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ అందుకోవడంతో దీనికి సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.కామెడీతో కడుపుబ్బా నవ్వించిన ఎఫ్ 2 ఇప్పుడు మరింత ఫన్ తో ఎఫ్ 3 గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సమ్మర్ లో ట్రిపుల్ ఫన్ అందించడానికి వస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు సంబందించినా పోస్టర్స్ ఇప్పటికే విడుదల అయ్యి మంచి స్పందన తెచ్చుకున్నాయి.

ఇక నేడు మరొక కొత్త పోస్టర్ తో టీమ్ ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చింది.

జనవరి 19న వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో ఎఫ్ 3 టీమ్ సరి కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ వరుణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ పోస్టర్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టు కుంటుంది.

ఇది డబ్బు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ముందు నుండే చెబుతూ వస్తున్నారు.మరి తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అలానే ఉంది.

Telugu Anil Ravipudi, Happy, Poster, Tamanna, Wishesvarun, Tollywood, Varun Tej,

ఈ పోస్టర్ లో వరుణ్ డ్యాన్స్ ఫోజ్ ఇచ్చి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ లో అదిరిపోయాడు.ఇక వరుణ్ తన చేతిలో డబ్బు నోట్లను పట్టుకుని ఉన్నాడు.ఈ పోస్టర్ తో మరోసారి ఈ సినిమా అంత డబ్బు చుట్టూనే తిరుగుతుందని చెప్పారు.ఇక ఈ సినిమాను ఏప్రిల్ 28, 2022న అరిలీజ్ చేసేందుకు రెడీ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.మరి ఈ సమ్మర్ సోగాళ్ళు ఎలా అలరిస్తారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube