తెలంగాణ లో మంత్రికే ఎస‌రు పెడుతోన్న ఎంపీ   Tealangana Lo Mantrini Target Chesina MP     2018-04-10   00:50:18  IST  Bhanu C

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అయ్యింది. స‌హ‌జంగానే టిక్కెట్ల కోసం ఫైటింగ్‌లు షురూ అవుతాయి. క‌ప్పుల త‌క్కెడ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి జంపింగ్‌లు కామ‌న్‌. ఇక అధికార పార్టీల్లోనూ టిక్కెట్లు ఆశించే వాళ్లు త‌మ పార్టీ వాళ్ల‌కే ఎర్త్‌లు పెడుతుంటారు. వాళ్ల వెన‌కే ఉంటూ వాళ్ల‌కే గోతులు తీస్తుంటారు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఎక్కువుగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో అధికార పార్టీలో ఓ మంత్రి సీటుకు ఇప్పుడు ఓ ఎంపీ ఎర్త్ పెడుతున్న‌ట్టే అక్క‌డ పొలిటిక‌ల్ వాతావ‌ర‌ణం చెప్పేస్తోంది.

ఉమ్మ‌డి ఓరుగ‌ల్లు జిల్లాలో ఓ ఎంపీ వ్య‌వ‌హారం తీవ్ర‌చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అసెంబ్లీ టికెట్ సాధించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఓ మంత్రి సీటుకే ఎస‌రుపెడుతున్న‌ట్లు స‌మాచారం. పాత వ‌రంగ‌ల్ జిల్లా ప్ర‌స్తుత మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రం నుంచి ఎంపీగా ఉన్న ప్రొఫెస‌ర్ సీతారాం నాయ‌క్ మంత్రి, ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందూలాల్ సిట్టింగ్ సీటుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎర్త్ పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అధికార పార్టీ ఇన్న‌ర్ సర్కిల్స్ ప్ర‌కారం వ‌చ్చే ఎన్నిక‌ల్లో ములుగు నుంచి ఉన్న మంత్రి చందూలాల్‌తో పాటు మహ‌బూబాబాద్ ఎమ్మెల్యే శంక‌ర్‌నాయ‌క్‌కు సీటు ఇవ్వ‌ర‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక ఇదే అద‌నుగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి స్టేట్ కేబినెట్‌లో మంత్రి అవ్వాల‌ని ఎంపీ సీతారాం నాయ‌క్ స్కెచ్ గీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు అయిన మ‌హ‌బూబాబాద్‌, ములుగు మీద క‌న్నేసి అక్క‌డ ప‌ట్టుకోసం ఇన్వాల్ అవుతున్నారు.

ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో మ‌హ‌బూబాబాద్ కోసం మ‌రో మాజీ మంత్రి రెడ్యానాయ‌క్ కూడా త‌న కుమార్తె అయిన మాజీ ఎమ్మెల్యే క‌విత లేదా వార‌సుడి కోసం ప‌ట్టుబ‌ట్టే ఛాన్సులు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే చందూలాల్‌ను ఎలాగూ త‌ప్పిస్తార‌నే ములుగులో ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో పాటు అక్క‌డ గిరిజ‌న సంఘాల నేత‌ల‌తో ఎంపీ మీట్ అవుతున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఎంపీ జోక్యాన్ని చందూలాల్ ఎంత మాత్రం జోక్యం చేసుకోలేక‌పోతున్నారు.

ఇటీవ‌ల తండాల‌ను పంచాయ‌తీలు గుర్తించారు. ఈ క్ర‌మంలోనే కేసీఆర్‌ను అభినందించేందుకు గిరిజ‌న గ్రామాల ప్ర‌తినిధులు, నాయ‌కులు సీఎం కేసీఆర్‌తో మీట్ అయ్యారు. దీనికి ఎంపీ సీతారాం నాయ‌క్ హాజ‌రైతే ఎమ్మెల్యేలు శంక‌ర్‌నాయ‌క్‌, చందూలాల్ ఇద్ద‌రూ డుమ్మా కొట్టారు. ఎంపీ వ్య‌వ‌హార శైలీతో ప‌ట్ట‌రాని కోపంతో ఉన్న వీరిద్ద‌రు కావాల‌నే ఈ స‌మావేశానికి రాలేద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు వ‌చ్చే ఎన్నిక‌ల్లో చందూలాల్‌ను త‌ప్పిస్తార‌ని… ఆయ‌న వార‌సుడికి కూడా సీటు లేద‌న్న ప్ర‌చారం ములుగులో జోరుగా జ‌రుగుతోంది.