కరోనా ఎఫెక్ట్: విద్యార్ధులకు మైకుల్లో పాఠాలు ...!

విద్య నేర్చుకోవాలి కానీ… అందుకు అనేక రకాల దారులు ఉంటాయి.ఈ కరోనా కాలంలో పాఠాలు నేర్చుకునే తీరే పూర్తిగా మారిపోయింది.

 Teaching Classes In Mikes, Jharkhand, Corona Effect, Teachers-TeluguStop.com

వాటికోసం అసలు స్కూలుకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది.కరోనా వైరస్ రాక ముందు సరాసరి పాఠశాలకు వెళ్లి కూర్చుంటే ఉపాధ్యాయుడు వచ్చి పాఠాలు నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళం.

కానీ ఇప్పుడు కరోనా పుణ్యమా అని అంతా ఆన్ లైన్ క్లాసుల మహిమ అయిపోయింది.బాగా ఉన్నవారికైతే ఫోన్లు, కంప్యూటర్లు వాటికీ నెట్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి చూడడానికి సౌకర్యంగా ఉంటుంది.

కానీ, అవన్నీ లేని వారికి ఎలా అని ఆలోచిస్తున్నారు కదా… ఇటువంటి వారికోసం ఓ పాఠశాల హెడ్ మాస్టర్ ప్లాన్ వేశాడు.

ఆయన చదువు చెప్పే పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 246 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

అయితే అందులో 204 మందికి స్మార్ట్ ఫోన్ సదుపాయం లేదు.ఉన్న కూడా వారికి ఇంటర్నెట్ సదుపాయం లేదు.ఇక దీంతో ఆయన ఆలోచనకు పదును పెట్టి స్కూల్ చుట్టూ మైకులు పెట్టించారు.ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

ఇక ఆ పాఠశాలలో మొత్తం ఐదుగురు టీచర్లు స్కూల్ నుంచి పాఠాలు చెబుతుంటే పిల్లలు వినేలా వారు ఏర్పాటు చేశారు.

ఒకవేళ వారు బోధించిన పాఠాలలో ఏదైనా డౌట్ వస్తే వారి ఫోన్ కు ఒక మెసేజ్ పెడితే చాలు, మరుసటి రోజు వాటిని పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు.

ఈ సంఘటన ఏప్రిల్ 16 నుండి ప్రతిరోజు ఉదయం రెండు గంటల సమయం పాటు మైకుల్లో పాఠాలు చెబుతూ పాఠశాలల్లోని విద్యార్థులకు క్లాసెస్ బోధిస్తున్నారు ఉపాధ్యాయులు.ఇటువంటి మాస్టర్ ప్లాన్ తో పాఠాలు చెబుతున్న పాఠశాల ఉపాధ్యాయ బృందం దుమ్కా జిల్లా విద్యాధికారి పూనం కుమారి ప్రశంసించారు.

ఇటువంటి ఐడియాతో విద్యార్థులకు క్లాసులు చెప్పడం చాలా బాగుందని ఆవిడ ఉపాధ్యాయుల అంకితభావం గురించి మాట్లాడారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube