టీచర్లు రీల్స్ చేస్తూ, విద్యార్థులను లైకులు కొట్టమని ఒత్తిడి చేస్తున్న వైనం!

Teachers Record Instagram Reels Force Students To Like And Share Details, Teachers, Reels, Latest News, Viral Latest, News Viral, Social Media, Viral, Presure, Likes, Amroha School, Teachers Instagram Reels, Force Students , Like And Share, Uttar Pradesh

స్మార్ట్ ఫోన్ నేటి మనుషుల జీవితంలో ఒక భాగం అయిపోయిందని చెప్పుకోవచ్చు.చిన్నపిల్లలనుండి పెద్దవాళ్ళ వరకు దానికి అడిక్ట్ అయిపోయారనే చెప్పుకోవచ్చు.

 Teachers Record Instagram Reels Force Students To Like And Share Details, Teache-TeluguStop.com

ఈ క్రమంలో ఆఖరికి పిల్లలను మంచి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు( Teachers ) కూడా అదే మాదిరిగా తయారయితే ఇక ఈ జెనరేషన్ పిల్లల గతి యేమవుతుంది? ఇపుడు అలాంటి ఓ సంఘటన ప్రస్తుతం మీడియా సర్కిల్స్ లో వైరల్ అవుతోంది.అవును, యూపీకి( Uttar Pradesh ) చెందిన ఉపాధ్యాయులు కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లు పెడుతూ, రీల్స్ చేస్తూ ఆ తరువాత పిల్లల్ని లైకులు, షేర్లు కొట్టమని బలవంతం చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Telugu Amroha School, Force, Latest, Share, Presure, Reels, Teachers, Teachers R

కాగా ఈ తంతు కాస్త విద్యార్ధులు( Students ) తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లడంతో వార్త వెలుగులోకి వచ్చింది.ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను లైక్, షేర్ మరియు సబ్‌స్క్రయిబ్ చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయంలో సదరు టీచర్స్ పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం)ని ఆశ్రయించగా ఈ విషయం స్థానికంగా పెను సంచలంగా మారింది.

Telugu Amroha School, Force, Latest, Share, Presure, Reels, Teachers, Teachers R

వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని కొంతమంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు తమ విద్యార్థులను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో( Instagram ) వారు చేసిన పోస్టులకు లైక్ మరియు షేర్ చేయమని అంతేకాకుండా వారి ఖాతాలను సబ్‌స్క్రయిబ్ చేయమని కూడా బలవంతం చేశారు.ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం ఆ టీచర్లలో రోజుకి ఒకరు స్కూల్‌లో షూట్ చేస్తూ వూంటారు.కాగా ఇదే విషయమై పాఠశాలలో విధుల్లో ఉన్నప్పుడు ఉపాధ్యాయులు ఇన్‌స్టాగ్రామ్‌లో కంటెంట్‌ను సృష్టిస్తున్నారని విద్యార్థులు పేర్కొన్నారు.దీనిపై బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి గంగేశ్వరి ఆర్తి గుప్తా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube